రామ్‌చరణ్‌కు 'బాహుబలి' కాజాతో సన్మానం.. డైరెక్టర్‌ శంకర్‌కు కూడా, ఫొటోలు వైరల్

  • IndiaGlitz, [Monday,March 07 2022]

దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్‌తో కలిసి నటించిన ఆర్ఆర్ఆర్ షూటింగ్ ముగియడం, విడుదలకు  సిద్ధమవ్వడంతో మెగా పవర్ స్టార్ రామ్‌చరణ్ తన మిగిలిన ప్రాజెక్ట్స్‌పై దృష్టి సారించారు. ఈ నేపథ్యంలో తమిళ దర్శక దిగ్గజం శంకర్ డైరెక్షన్‌లో RC15 షూటింగ్‌లో పాల్గొంటున్నారు చెర్రీ. ఈ చిత్రంలో కియారా అద్వానీ హీరోయిన్‌ గా నటిస్తోంది. దిల్‌రాజు నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. శ్రీకాంత్, అంజలి, సునీల్‌, జయరామ్‌ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్‌ తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి పరిసరాల్లో జరుగుతోంది. రామ్‌చరణ్‌పై కీలక సన్నివేశాలు చిత్రీకరిస్తున్నారు. ఈక్రమంలో చరణ్‌కు అరుదైన గౌరవం దక్కింది.

రాజమండ్రిలోని ఓ హోటల్‌ బస చేస్తున్న రామ్‌చరణ్‌కు తాపేశ్వరం సురుచి వర్మ ‘బాహుబలి’ కాజాను అందజేశారు. కాగా తూర్పుగోదావరి జిల్లాకు ప్రముఖులు ఎవరు వచ్చినా వారికి గౌరవ పూర్వకంగా బాహుబలి కాజాను ఇవ్వడం సాంప్రదాయంగా వస్తోంది. చరణ్‌ తో పాటు డైరెక్టర్‌ శంకర్‌‌కు కూడా ఈ కాజాను బహుమతిగాఅందించారు సురుచి వర్మ. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

అంతకుముందు భారత ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు, మెగాస్టార్ చిరంజీవి, ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు, సమంత వంటి ప్రముఖులకు కూడా బాహుబలి కాజా అందింది. అలాగే కొన్నినెలల క్రితం ఆడవాళ్లు మీకు జోహార్లు సినిమా షూటింగ్‌ కోసం రాజమండ్రికి వచ్చిన శర్వానంద్‌, రష్మిక‌లకు కూడా బాహుబలి కాజాను బహుమతిగా అందించారు సురుచి వర్మ.

More News

చిక్కుల్లో సోనాక్షీ సిన్హా: చీటింగ్ కేసు, నాన్ బెయిల‌బుల్ అరెస్ట్ వారెంట్‌ జారీ

బాలీవుడ్ సీనియర్ నటుడు శతృఘ్న సిన్హా నటవారసురాలిగా ఎంట్రీ ఇచ్చిన ముద్దుగుమ్మ సోనాక్షీ సిన్హా తొలుత వరుస విజయాలతో మంచి ఊపు మీద కనిపించింది.

క్రికెట్ లవర్స్‌కి గుడ్‌న్యూస్.. ఐపీఎల్ షెడ్యూల్ వచ్చేసిందోచ్, సన్‌రైజర్స్ ఫస్ట్ మ్యాచ్ ఆ జట్టుతోనే?

క్రికెట్ ప్రేమికులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఐపీఎల్ 2022 షెడ్యూల్‌ను భారత క్రికెట్ నియంత్రణా మండలి (బీసీసీఐ) ఆదివారం ప్రకటించింది. మార్చి 26వ తేదీ నుంచి మే 29వ తేదీ వరకు...

షేన్‌వార్న్ మరణంపై కొత్త అనుమానాలు.. హోటల్ గదిలో, టవల్స్‌పై రక్తపు మరకలు

ఆస్ట్రేలియా క్రికెట్ దిగ్గజం షేన్ వార్న్ మరణంతో క్రికెట్ ప్రేమికులు షాక్‌కు గురయ్యారు. ఆయన లేరనే వార్తతో క్రికెట్ ప్రపంచం మూగబోయింది. తన స్పిన్ మాయాజాలంతో జట్టుకు ఎన్నో చిరస్మరణీయమైన విజయాలు అందించి..

దిగిరానున్న మద్యం ధరలు.. మందుబాబులకు త్వరలో తెలంగాణ సర్కార్ గుడ్‌న్యూస్..?

మందు బాబులకు తెలంగాణ ప్రభుత్వం త్వరలో గుడ్‌న్యూస్ చెప్పే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇందుకోసం రాష్ట్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు వచ్చినట్లు సమాచారం. కొవిడ్ 19 వ్యాప్తి సమయంలో రాష్ట్రంలో ఎక్సైజ్ శాఖ మద్యం

బీఎస్ఎఫ్ క్యాంపులో విషాదం : తోటి సైనికులపై జవాన్ కాల్పులు.. ఐదుగురి మృతి

పంజాబ్‌లో దారుణం జరిగింది. ఓ జవాను తోటి సైనికులపై కాల్పులు జరపడంత