'బద్రి'కి 16 ఏళ్లు
Send us your feedback to audioarticles@vaarta.com
'బద్రి' ఈ పేరు చెబితే మనకు మూడు విషయాలు గుర్తుకు వస్తాయి. అందులో మొదటిది పవర్ స్టార్ పవన్‌కల్యాణ్, రెండోది డైరెక్టర్ పూరి జగన్నాథ్, ఇక మూడోది నువ్వు నందా అయితే, నేను బద్రి, బద్రినాథ్ అయితే ఏంటి..? అనే డైలాగ్. హీరోలను డిఫరెంట్‌గా ప్రెజెంట్ చేసే డైరెక్టర్ పూరి జగన్నాథ్ పవన్ కల్యాణ్‌ను స్టయిలిష్‌గా, మాస్ ఇమేజ్‌ను మిక్స్ చేసి చూపించాడు.
ఒకవైపు ప్రేమకు బానిస అనే బద్రి, ప్రేమ కోసం ఏం చేశాడనే విషయాన్ని ఒకవైపు క్లాస్‌గా, మరో వైపు మాస్‌గా చూపించడం పూరికే చెల్లింది. అలాగే పూరి రాసుకున్న బద్రి క్యారెక్టర్‌కు పవన్ తనదైన నటనతో హండ్రెడ్ పర్సెంట్ న్యాయం చేశాడు. సింపుల్‌గా చెప్పాలంటే ఇద్దరి ప్రేయసిల మధ్య ప్రేమికుడు బద్రి, తన లవర్ కోసం ప్రేయసి ఏం చేసిందనేదే అసలు కథ. విజయలక్ష్మి ఆర్ట్ మూవీస్ బ్యానర్‌పై టి.త్రివిక్రమరావు ఈ చిత్రాన్ని నిర్మించారు. అమీషా పటేల్, రేణుదేశాయ్ హీరోయిన్స్‌గా నటించారు. పఏప్రిల్ 20న 2000లో విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ విన్నర్‌గా నిలవడమే కాకుండా వన్ కెరీర్ వన్ ఆఫ్ ది బెస్ట్ హిట్‌గా నిలిచింది. బద్రి విడుదలైన నేటికి సరిగ్గా పదహారేళ్లు పూర్తయ్యింది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com