close
Choose your channels

'భద్రమ్ బి కేర్ ఫుల్ బ్రదరు' టీజర్ విడుదల

Tuesday, December 15, 2015 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

సంపూర్ణేష్‌బాబు, చరణ్‌, రాజ్‌, రోషన్‌, హమీదా ప్రధాన తారాగణంగా ముల్లపూడి రామ్‌జీ సమర్పణలో సాయివెంకట్‌ ఎంటర్‌టైన్మెంట్స్‌, మారుతి టీం వర్క్స్‌ బ్యానర్స్‌పై రూపొందుతోన్న చిత్రం భద్రమ్‌ బి కేర్‌ ఫుల్‌ బ్రదరు`. రాజేష్‌ పులి దర్శకత్వంలో బోనం కృష్ణ సతీష్‌, అడగర్ల జగన్‌బాబు, ఉప్పులూరి బ్రహ్మాజీ ఈ చిత్రాన్ని రూపొందించారు. యంగ్ హీరో నిఖిల్ మంగళవారం హైదరాబాద్ లో జరిగిన ప్రెస్ మీట్ లో టీజర్ ను విడుదల చేశారు.

కొంత మందికి అవకాశాలు ఉపయోగించుకోవడం తెలియదు. భ్రదమ్ బి కేర్ ఫుల్ సినిమా యూనిట్ ను చూస్తే అవకాశాన్ని చక్కగా వినియోగించుకున్నట్లు తెలుస్తుంది. నిర్మాతలు నాకు మంచి మిత్రులు. సినిమా ఎంటర్ టైనింగ్ గా సాగుతుంది. తప్పకుండా అందరికీ నచ్చే సినిమా అవుతుందని ప్రముఖ దర్శక నిర్మాత మారుతి తెలియజేశారు.

ప్రేక్షకులు ఆదరించిన సినిమాలే పెద్ద సినిమాలు, మంచి సినిమాలు అవుతాయి. మారుతిగారు కొత్త టాలెంట్ ను ఎంకరేజ్ చేస్తున్నారు. టీజర్ బావుంది. ఈ సినిమా పెద్ద సక్సెస్ అయి ఇందులో నటించిన నటీనటులు, టెక్నిషియన్స్ కు మంచి పేరు తీసుకురావాలని హీరో నిఖిల్ అన్నారు.

ఇది నా రెండో సినిమా. మారుతిగారు, నటీనటులు, టెక్నిషియన్స్‌ అందరూ బాగా సపోర్ట్‌ చేస్తున్నారు. అందరికీ థాంక్స్ అని దర్శకుడు రాజేష్ పులి అన్నారు.

మారుతిగారు కథ ఓకే చెయ్యగానే సినిమా షూటింగ్‌ను ప్రారంభించాం. మారుతిగారు ఈ సినిమా విషయంలో ఫుల్ సపోర్ట్ చేశఆరు. రీసెంట్ గా భలే భలే మగాడివోయ్‌, కుమారి 21 ఎఫ్‌ వంటి చిన్న చిత్రాలు పెద్ద హిట్ అయ్యాయి అలాగే ఈ చిత్రం కూడా పెద్ద సక్సెస్‌ను సాధిస్తుందని నిర్మాత బోనం కృష్ణ సతీష్ అన్నారు.

ఈ కార్యక్రమంలో చరణ్‌, రాజ్‌, రోషన్‌, హమీదా సహా చిత్ర యూనిట్ సభ్యులు పాల్గొని అవకాశం ఇచ్చిన దర్శక నిర్మాతలకు ధన్యవాదాలు చెప్పారు.

సత్యం రాజేష్‌, సూర్య, ప్రభాస్‌ శ్రీను, వేణుగోపాల్‌, సారిక రామచంద్రరావు, జ్యోతి తదితరులు ఇతర తారాగణం. ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ: మల్హర్ భట్‌ జోషి, ఎడిటింగ్‌: కార్తీక శ్రీనివాస్‌, సంగీతం: జెబి, నిర్మాతు: బోనం కృష్ణ సతీష్‌, అడగర్ల జగన్‌బాబు, ఉప్పులూరి బ్రహ్మాజీ, దర్శకత్వం: రాజేష్‌ పులి.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.   

Comments

Welcome to IndiaGlitz comments! Please keep conversations courteous and relevant to the topic. To ensure productive and respectful discussions, you may see comments from our Community Managers, marked with an "IndiaGlitz Staff" label. For more details, refer to our community guidelines.
settings
Login to post comment
Cancel
Comment