ఎన్టీఆర్ ఫ్యాన్స్ కి బ్యాడ్ న్యూస్.. అది ఆగిపోయినట్లే ?
Send us your feedback to audioarticles@vaarta.com
యంగ్ టైగర్ వరుస ప్రాజెక్ట్స్ తో బిజీ అవుతున్నాడు. కెరీర్ లో ఎన్నడూ లేని విధంగా ఎన్టీఆర్ భారీ చిత్రాలకు సైన్ చేస్తున్న సంగతి తెలిసిందే. రాబోవు రెండు మూడేళ్ళలో ఎన్టీఆర్ ఫ్యాన్స్ కు ఫుల్ ఎంటెర్టైన్మ్నెట్ దక్కనుంది. నార్త్ లో అయితే సినీ హీరోలకు కూడా బుల్లి తెరపై మోజు ఎక్కువ. నార్త్ లో స్టార్ హీరోలు బుల్లితెరపై షోలు చేస్తున్న సంగతి తెలిసిందే.
ఇదీ చదవండి: మళ్ళీ నితిన్ తోనే.. సూపర్ హిట్ కాంబో రిపీట్ ?
సౌత్ లో కూడా ఇప్పుడిప్పుడే ఈ ట్రెండ్ మొదలవుతోంది. బిగ్ బాస్ తెలుగు సీజన్ 1 హోస్ట్ గా ఎన్టీఆర్ అదరగొట్టేశాడు. దీనితో ఎన్టీఆర్ ని బుల్లి తెరపై మళ్ళీ చూడాలని అభిమానులు కోరుకుంటున్నారు. అందుకు తగ్గట్లుగానే ఎన్టీఆర్ ' మీలో ఎవరు కోటీశ్వరులు ' అనే షోకి సైన్ చేశాడు. ఇటీవల ప్రకటన కూడా వచ్చింది. మే చివరి వారంలో షో ప్రారంభించడానికి ఏర్పాట్లు కూడా ప్రారంభించారు. ఇంతలోనే కరోనా సెకండ్ వేవ్ ప్లాన్స్ అన్నింటినీ నాశనం చేసింది.
ఈ షో వాయిదా పడుతుందని, కరోనా కేసులు తగ్గాక ప్రారంభిస్తారని వార్తలు వచ్చాయి. తాజా సమాచారం మేరకు ఈ షోని పూర్తిగా రద్దు చేసినట్లు వార్తలు వస్తున్నాయి.
ఈ షోలో పాల్గొనే వారి ఎంపిక తెలుగు రాష్ట్రాల్లో వివిధ ప్రాంతాల నుంచి జరగాలి. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇది సాధ్యం కాదని నిర్వాహకులు షో రద్దు చేశారని టాక్.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Devan Karthik
Contact at support@indiaglitz.com
Comments