Wines Bandh :మందుబాబులకు బ్యాడ్ న్యూస్.. మూడు రోజలు వైన్స్ బంద్..
Send us your feedback to audioarticles@vaarta.com
తెలంగాణలో మందుబాబులకు కేంద్రం ఎన్నికల సంఘం బ్యాడ్ న్యూస్ అందించింది. నవంబర్ 30న పోలింగ్ సందర్భంగా మూడు రోజుల పాటు వైన్స్, బార్లు మూతపడనున్నట్లు ప్రకటించింది. ఈమేరకు ఎక్సైజ్ శాఖ అధికారులకు సూచనలు చేసింది. సీఈసీ ఆదేశాల మేరకు ఈనెల 28 నుంచి 30 వరకూ అన్ని బార్లు, మద్యం దుకాణాలు మూసివేయాలని అబ్కారీ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది.
ఈ విషయంపై వైన్స్, బార్ల యజమానులకు సంబంధిత అధికారులు ముందస్తుగా సమాచారం అందించాలని సూచించింది. ఆ మూడు రోజులూ రాష్ట్రంలో ఎక్కడ కూడా మద్యం అందుబాటులో లేకుండా చర్యలు చేపట్టాలని ఆదేశించింది. దీంతో ఎవరైనా ఈ ఆదేశాలు ధిక్కరించి మద్యం అమ్మితే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు హెచ్చరించారు. పోలింగ్ ముగిసిన అనంతరం డిసెంబర్ 1న మద్యం షాపులు తెరుచుకోవచ్చని పేర్కొంది.
కాగా రాష్ట్రంలో నవంబర్ 30న పోలింగ్ జరగనుండగా.. ఈనెల 27 సాయంత్రం 6 గంటలకు ఎన్నికల ప్రచారం ముగియనుంది. దీంతో అప్పటి నుంచి పోలింగ్ ముగిసే వరకు అభ్యర్థులెవరూ ప్రచారం చేయడానికి వీలులేదు. ఇక డిసెంబర్ 3న కౌంటింగ్ జరగనుంది. కౌంటింగ్ రోజు కూడా మద్యం షాపులు మూసివేసే అవకాశం ఉంది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments