Pawan Kalyan:పవర్ స్టార్ ఫ్యాన్స్‌కు బ్యాడ్ న్యూస్.. అప్పటి దాకా ఆగాల్సిందే..
Send us your feedback to audioarticles@vaarta.com
పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ప్రస్తుతం రాజకీయాలకు ఎక్కువ టైమ్ కేటాయిస్తున్నారు. మొన్నటివరకు తెలంగాణ ఎన్నికల ప్రచారంలో బిజీగా ఉన్న ఆయన.. ఇప్పుడు ఏపీ ఎన్నికలపై ఫుల్ ఫోకస్ పెట్టారు. దీంతో పవన్.. కమిట్ అయిన సినిమాల షూటింగ్ ఆలస్యమవుతూ వస్తున్నాయి. ఇప్పటికే హరీశ్ శంకర్ దర్శత్వం వహిస్తున్న 'ఉస్తాద్ భగత్ సింగ్', క్రిష్ దర్శకత్వంలో 'హరిహర వీరమల్లు' సినిమాల షూటింగ్ వాయిదా పడింది. తాజాగా సుజీత్ డైరెక్ట్ చేస్తున్న 'ఓజీ' షూటింగ్ కూడా వాయిదా పడినట్లు చిత్ర నిర్మాణ సంస్థ ప్రకటించింది.
"పుట్టినరోజు శుభాకాంక్షలతో మా టైమ్ లైన్ అంతా నిండిపోయింది. అభిమానులు కొత్త అప్డేట్ కోసం ఆకలి మీద ఉన్నారు. ఇందుమూలంగా మీకు తెలియజేసేది ఏమంటే... ప్రస్తుతం మేం షూటింగ్ చేయడం లేదు. అందువల్ల, అప్డేట్స్ ఇవ్వడం కోసం మరింత టైం పడుతుంది. వెండితెర మీద తమ అభిమాన దేవుడిని చూడటానికి పవన్ కళ్యాణ్ అభిమానులు ఎక్కువ రోజులు వెయిట్ చేయక తప్పదు'' అని డీవీవీ ఎంటర్టైన్మెంట్స్ ట్వీట్ చేసింది. దీంతో పవర్ స్టార్ ఫ్యాన్స్ తీవ్ర నిరాశ వ్యక్తం చేస్తున్నారు. మూడు సినిమాల షూటింగ్‌లు ఆగిపోవడంతో ఇప్పుడలా తమ అభిమాన హీరో వెండితెర మీద చూడలేమంటూ కామెంట్స్ చేస్తున్నారు.
కాగా పవన్ కల్యాణ్ పుట్టినరోజు సందర్భంగా సెప్టెంబర్ 2న విడుదలైన 'ఓజీ' టీజర్ సోషల్ మీడియాను ఓ ఊపు ఊపేసింది. అందులో పవన్ బాడీ లాంగ్వేజ్, సుజీత్ డైరెక్షన్, విజువల్స్ మైండ్ బ్లోయింగ్‌గా ఉన్నాయి. దీంతో ఫ్యాన్స్ ఆనందానికి ఆవదులు లేకుండా పోయాయి. ఈ నేపథ్యంలో మూవీ ఎప్పుడెప్పుడా రిలీజ్ అవుతుందా..? థియేటర్లలో చూద్దామా..? అని ఈగర్‌గా వెయిల్ చేస్తున్నారు. కానీ పవన్ రాజకీయ కార్యక్రమాలతో బిజీగా ఉండటంతో వచ్చే ఏడాది ఎన్నికలు అయిపోయే వరకు మూవీ షూటింగ్‌ల్లో పాల్గొనడం కష్టమేనని జనసేన వర్గాలు చెబుతున్నాయి. దాంతో 2024 చివర్లో పవన్ సినిమాలు తెర మీద చూసే అవకాశం లభించనుంది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Devan Karthik
Contact at support@indiaglitz.com
Comments