‘విరాటపర్వం’ : సాయిపల్లవి ఫ్యాన్స్‌కి బ్యాడ్ న్యూస్
- IndiaGlitz, [Tuesday,March 30 2021]
వేణు ఊడుగుల దర్శకత్వంలో నేషనల్ స్టార్ రానా దగ్గుబాటి, సెన్సేషనల్ బ్యూటీ సాయిపల్లవి జంటగా రూపొందుతోన్న చిత్రం 'విరాటపర్వం'. ‘రివల్యూషన్ ఈజ్ ఏన్ యాక్ట్ ఆఫ్ లవ్’ అనే ట్యాగ్‌లైన్‌తో ఈ సినిమా తెరకెక్కుతోంది. డి. సురేష్ బాబు సమర్పణలో ఎస్.ఎల్.వి. సినిమాస్ పతాకంపై సుధాకర్ చెరుకూరి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమాకు సంబంధించి ఇప్పటి వరకూ చిత్ర యూనిట్ వదిలిన అప్‌డేట్స్ అన్నీ ఆకట్టుకున్నాయి. ఇటీవలే విడుదలైన టీజర్ సినిమాపై అంచనాలను ఆకాశానికి చేర్చింది. నక్సలైట్ బ్యాక్ డ్రాప్‌లో ఈ చిత్రం రూపొందింది. అంతేకాదు.. రానా ఈ సినిమాలో ‘అరణ్య’ పేరుతో కవితలు చేసింది.
అయితే ఈ సినిమాకు సంబంధించి తాజాగా ఓ అప్‌డేట్ టాలీవుడ్‌లో చక్కర్లు కొడుతోంది. ఇది సాయిపల్లవి అభిమానులకు నిజంగా బ్యాడ్ న్యూసే. ఈ సినిమాలో సాయిపల్లవి చనిపోతుందట. ఆమె మృతితో సినిమా శాడ్ ఎండింగ్‌తో ముగుస్తుందట. నిజానికి కొంత కాలం క్రితమైతే శాడ్ ఎండింగ్ మూవీస్ తెలుగు ప్రేక్షకులకు ఎక్కేవి కావు. శాడ్ ఎండింగ్ ఉంటే ఆ సినిమా ఫట్టే. కానీ ఇప్పుడిప్పుడు ఈ సినిమాలకు సైతం ఆదరణ పెరుగుతోంది. ‘నేనే రాజు నేనే మంత్రి’ సైతం శాడ్ ఎండింగ్‌తోనే ముగుస్తుంది. ఈ సినిమాకు ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు. ‘కలర్ ఫోటో’ సైతం శాడ్ ఎండింగే అయినప్పటికీ ఈ సినిమాకు అద్భుతమైన ఆదరణ లభించింది. ఈ సినిమా కూడా మంచి సక్సెస్ అవుతుందనడంలో సందేహం లేదనిపిస్తోంది.
‘ఆధిపత్య జాడలనే చెరిపేయగ ఎన్నినాళ్లు.. తారతమ్య గోడలనే పెకిలించగా ఎన్నినాళ్లు..’ అంటూ రానా చెప్పే కవితలు అద్భుతం. ప్రజలకు జరుగుతున్న అన్యాయాలను ఎదుర్కొనేందుకు గన్ చేతబట్టిన రానా.. రానా కవిత్వానికి ముగ్దురాలైన సాయిపల్లవి.. శ్రీకృష్ణుడి కోసం కన్నవారిని, కట్టుకున్న వారిని వదలి వెళ్లిన మీరాలా ఆయనను వెదుక్కుంటూ వెళ్లడం.. అక్కడ ఆమె ఎదుర్కొనే పరిస్థితులు.. చివరకు సాయిపల్లవి చనిపోవడం వంటి అంశాలతో ఈ సినిమా రూపొంది. చాలా కాలం తర్వాత ప్రజా సమస్యలను.. భూస్వామ్య వ్యవస్థను ఎదిరిస్తూ రూపొందిన ఒక సినిమా రాబోతోంది. అయితే ఈ సినిమా ఈ కాలానికి తగ్గట్టుగా ప్రతి ఒక్కరినీ ఆకట్టుకునేలా రూపొందించినట్టు తెలుస్తోంది.