Pawan Kalyan:పవర్‌ స్టార్ ఫ్యాన్స్‌కు బ్యాడ్ న్యూస్.. అప్పటి దాకా ఆగాల్సిందే..

  • IndiaGlitz, [Tuesday,December 12 2023]

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ప్రస్తుతం రాజకీయాలకు ఎక్కువ టైమ్ కేటాయిస్తున్నారు. మొన్నటివరకు తెలంగాణ ఎన్నికల ప్రచారంలో బిజీగా ఉన్న ఆయన.. ఇప్పుడు ఏపీ ఎన్నికలపై ఫుల్ ఫోకస్ పెట్టారు. దీంతో పవన్.. కమిట్ అయిన సినిమాల షూటింగ్ ఆలస్యమవుతూ వస్తున్నాయి. ఇప్పటికే హరీశ్ శంకర్ దర్శత్వం వహిస్తున్న 'ఉస్తాద్ భగత్ సింగ్', క్రిష్ దర్శకత్వంలో 'హరిహర వీరమల్లు' సినిమాల షూటింగ్ వాయిదా పడింది. తాజాగా సుజీత్ డైరెక్ట్ చేస్తున్న 'ఓజీ' షూటింగ్ కూడా వాయిదా పడినట్లు చిత్ర నిర్మాణ సంస్థ ప్రకటించింది.

పుట్టినరోజు శుభాకాంక్షలతో మా టైమ్ లైన్ అంతా నిండిపోయింది. అభిమానులు కొత్త అప్డేట్ కోసం ఆకలి మీద ఉన్నారు. ఇందుమూలంగా మీకు తెలియజేసేది ఏమంటే... ప్రస్తుతం మేం షూటింగ్ చేయడం లేదు. అందువల్ల, అప్డేట్స్ ఇవ్వడం కోసం మరింత టైం పడుతుంది. వెండితెర మీద తమ అభిమాన దేవుడిని చూడటానికి పవన్ కళ్యాణ్ అభిమానులు ఎక్కువ రోజులు వెయిట్ చేయక తప్పదు'' అని డీవీవీ ఎంటర్టైన్మెంట్స్ ట్వీట్ చేసింది. దీంతో పవర్ స్టార్ ఫ్యాన్స్ తీవ్ర నిరాశ వ్యక్తం చేస్తున్నారు. మూడు సినిమాల షూటింగ్‌లు ఆగిపోవడంతో ఇప్పుడలా తమ అభిమాన హీరో వెండితెర మీద చూడలేమంటూ కామెంట్స్ చేస్తున్నారు.

కాగా పవన్ కల్యాణ్‌ పుట్టినరోజు సందర్భంగా సెప్టెంబర్ 2న విడుదలైన 'ఓజీ' టీజర్ సోషల్ మీడియాను ఓ ఊపు ఊపేసింది. అందులో పవన్ బాడీ లాంగ్వేజ్, సుజీత్ డైరెక్షన్, విజువల్స్ మైండ్‌ బ్లోయింగ్‌గా ఉన్నాయి. దీంతో ఫ్యాన్స్ ఆనందానికి ఆవదులు లేకుండా పోయాయి. ఈ నేపథ్యంలో మూవీ ఎప్పుడెప్పుడా రిలీజ్ అవుతుందా..? థియేటర్లలో చూద్దామా..? అని ఈగర్‌గా వెయిల్ చేస్తున్నారు. కానీ పవన్ రాజకీయ కార్యక్రమాలతో బిజీగా ఉండటంతో వచ్చే ఏడాది ఎన్నికలు అయిపోయే వరకు మూవీ షూటింగ్‌ల్లో పాల్గొనడం కష్టమేనని జనసేన వర్గాలు చెబుతున్నాయి. దాంతో 2024 చివర్లో పవన్ సినిమాలు తెర మీద చూసే అవకాశం లభించనుంది.

More News

Holidays in Telangana:తెలంగాణలో వచ్చే ఏడాది సెలవులు ప్రకటించిన ప్రభుత్వం

వచ్చే ఏడాదికి సంబంధించి సెలవుల జాబితాను తెలంగాణ ప్రభుత్వం ప్రకటించింది. ఈ జాబితాలో మొత్తం 27 సాధారణ సెలవులు,

CP Srinivas Reddy:హైదరాబాద్ సీపీగా శ్రీనివాస్‌రెడ్డి.. పలువురు ఐపీఎస్ అధికారులు బదిలీ..

పాలనలో తనదైన ముద్ర వేసేలా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ముందుకు సాగుతున్నారు. ఈ మేరకు తన టీమ్‌ను సిద్ధం చేస్తున్నారు.

TDP Leaders:వైసీపీ ఇంఛార్జ్‌ల మార్పుపై టీడీపీ నేతల సెటైర్లు

వైసీపీలో ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియని పరిస్థితిలో ఆ పార్టీ నేతలు ఉన్నారు. ఈసారి మెజార్టీ సిట్టింగ్ ఎమ్మెల్యేలకు పార్టీ అధినేత జగన్

YSSRCP: అధికారమే లక్ష్యంగా వైసీపీ పావులు.. నియోజకవర్గాల ఇంఛార్జ్‌లు మార్పు..

ఏపీలో ఎన్నికల వాతావరణం మొదలైంది. ఎన్నికలకు మరో మూడు నెలలు మాత్రమే సమయం ఉండటంతో అధికార వైసీపీ కదనరంగంలోకి దిగింది. గెలుపే లక్ష్యంగా పావులు కదుపుతోంది.

Bigg Boss Telugu 7 : నో నామినేషన్స్, ఓన్లీ ఎమోషనల్.. అమర్‌, అర్జున్‌లకు బుక్ ఆఫ్ మెమొరీస్ చూపిన బిగ్‌బాస్

బిగ్‌బాస్ తెలుగు 7 సీజన్ ముగింపుకు చేరుకుంది. మరో ఏడు రోజుల్లో సీజన్ ముగిసి.. కొత్త విజేత ఆవతరించనున్నాడు.