రోడ్డు ప్రమాదానికి గురైన ‘‘బచ్పన్ కా ప్యారా’’ ఫేమ్ బాలుడు.. పరిస్థితి విషమం
Send us your feedback to audioarticles@vaarta.com
‘బచ్పన్ కా ప్యార్’ పాటతో దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న బాలుడు సహ్‌దేవ్ దిర్దో రోడ్డు ప్రమాదానికి గురయ్యాడు. ఛత్తీస్‌గఢ్‌లోని సుకుమా జిల్లాలో మంగళవారం సాయంత్రం సహ్‌దేవ్ ద్విచక్రవాహనంపై వెళ్తుండగా రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ క్రమంలో వాహనం అదుపుతప్పి కిందపడటంతో సహ్‌దేవ్‌కు తీవ్ర గాయాలయ్యాయి. దీంతో చిన్నారిని తొలుత సుకుమా జిల్లా ఆసుపత్రికి తరలించారు. అనంతరం మెరుగైన చికిత్స కోసం సహ్‌దేవ్‌ను జగ్‌దల్‌పూర్ వైద్య కళాశాల ఆసుపత్రికి తీసుకెళ్లారు. సమాచారం అందుకున్న జిల్లా కలెక్టర్ వినీత్ నందన్‌వర్, ఎస్పీ సునీల్ శర్మ సహ్‌దేవ్ ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీశారు. అలాగే పిల్లాడికి మెరుగైన వైద్యం అందించాలని ఛత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రి భూపేశ్ భగేల్ అధికారులను ఆదేశించారు.
కమలేష్ బారోత్ కంపోజ్ చేసిన ‘బచ్‌పన్ కా ప్యార్’ సాంగ్ 2019లో యూట్యూబ్‌లో రిలీజ్ అయ్యింది. ఉత్తరాదిలో రూరల్ జనాలకు ఆ సాంగ్ బాగా కనెక్ట్ అయ్యింది. ఈ నేపథ్యంలో ఛత్తీస్‌గఢ్ సుక్మా జిల్లా చింద్‌ఘడ్‌కు చెందిన సహదేవ్ డిర్దో తన టీచర్ కోసం ‘బచ్(స్)పన్ క్యా ప్యార్’ అంటూ స్కూల్లో పాడాడు. అది టీచర్‌ను బాగా ఆకట్టుకుంది. దీంతో దానిని వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టగా అది వైరల్ అయ్యింది. ఈ క్రమంలో సహ్‌దేవ్‌కు దేశవ్యాప్తంగా ప్రముఖుల నుంచి ప్రశంసలు దక్కాయి. ఆ పాటను అనుకరిస్తూ పలువురు వీడియోలు కూడా చేశారు. ‘ జానే మేరీ జానేమన్.. బస్‌పన్ క్యా ప్యార్ మేరా..’ అంటూ సహ్‌దేవ్ పాడిన పాటకు ఛత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రి భూపేశ్ భగేల్ కూడా ఫిదా అయిపోయారు. స్వయంగా పిలిపించుకుని ఘనంగా సన్మానించారు సీఎం భూపేష్ బాఘేల్.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Devan Karthik
Contact at support@indiaglitz.com
Comments