పండంటి బిడ్డకు 'ఫొనీ' అని తుఫాను పేరు పెట్టారు!
- IndiaGlitz, [Friday,May 03 2019]
ఆంధ్రప్రదేశ్‌తో పాటు ఒడిషాను 'ఫొనీ' గడగడలాడిస్తున్న సంగతి తెలిసిందే. ఈ తుఫాను పేరు వింటేనే జనాలు బెంబేలెత్తిపోతున్నారు. ప్రస్తుతం ఎవరినోట విన్నా 'ఫొనీ' మాటే. ఈ తుఫాను దెబ్బకు ఎంతో మంది నిరాశ్రయులై రోడ్డున పడ్డారు. ప్రస్తుతం 'ఫొనీ' తీవ్రత ఒడిషాపైనే ఎక్కువగా ఉంది.
అయితే ఈ తుఫాను ఎప్పటికీ గుర్తుండిపోయేలా అప్పుడే పుట్టిన ఓ బిడ్డకు 'ఫొనీ' అని నామకరణం చేశారు. ఒడిషా రాష్ట్రంలోని రైల్వే ఆస్పత్రిలో ఓ తల్లి పండంటి బిడ్డకు జన్మనిచ్చింది. శుక్రవారం జన్మించిన ఈ బేబీకి ‘ఫొనీ’ అని పేరు పెట్టారు.
కాగా.. 32 ఏళ్ల మహిళ మాంచేశ్వర్‌లోని కోచ్ రిపేర్ వర్క్‌షాప్‌లో హెల్పర్‌గా పని చేస్తున్నట్లు తెలుస్తోంది. ఆ మహిళ ఇవాళ ఉదయం 11:03 గంటల సమయంలో రైల్వే ఆస్పత్రిలో డెలీవరీ అయ్యింది.
తల్లీ బిడ్డ క్షేమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. శుక్రవారం ఉదయం బంగాళాఖాతంలో ‘ఫొనీ’ తుఫాను అలజడి సృష్టించి ప్రచంఢ తుఫానుగా మారింది. అయితే ఇలా తుఫాను మారింది కూడా ఉదయం 11:03 గంటలకే కావడంతో.. ఇందుకు గుర్తుగా ‘ఫొనీ’ అని నామకరణం చేయడం జరిగింది.