బేబీ ఐ లవ్యూ.. బర్త్ డే రోజు త్రిషకు ట్వీట్..!
Send us your feedback to audioarticles@vaarta.com
దక్షిణాది స్లిమ్ బ్యూటీ త్రిష, టాలీవుడ్ ముద్దుగుమ్మ చార్మీ కౌర్‌ల ఫ్రెండ్షిప్ గురించి కొత్తగా చెప్పనక్కర్లేదు. వీరిద్దరూ ఒకప్పుడు అటు కోలీవుడ్.. ఇటు టాలీవుడ్‌ను ఏలిన సంగతి తెలిసిందే.! కాగా నేడు త్రిష పుట్టిన రోజు.. ఈ ముద్దుగుమ్మ 36వ పడిలోకి అడుగుపెట్టింది. ఈ సందర్భంగా త్రిషకు చార్మీ పుట్టిన రోజు శుభాకాంక్షలు అందరూ చెప్పినట్లు చెబితే బాగోదని వెరైటీగా చెప్పింది. ట్విట్టర్ వేదికగా శనివారం మధ్యాహ్నం చార్మీ ఆసక్తికర, సరదాగా ట్వీట్ చేసింది.
చార్మీ ట్వీట్ సారాంశం..
"బేబీ ఐ లవ్యూ. నిన్ను ఎప్పటికీ ప్రేమిస్తూనే ఉంటాను. నా ప్రపోజల్‌ను ఎప్పుడు అంగీకరిస్తావా..? అని ఎదురుచూస్తున్నాను. మనం పెళ్లి చేసుకుందాం. ఇప్పుడిది చట్టబద్ధమేనట!" అంటూ త్రిషను కవ్వించేలా చార్మీ ట్వీట్ చేసింది. కాగా వీరిద్దరూ ఇలా సరదాగా ట్వీట్ చేయడం.. అభిమానులు ఫుల్ ఖుషీ చేయడం కొత్తేమీ కాదు.. గతంలో పలుమార్లు ట్వీట్ చేసింది. అంతేకాదు ఒకానొక సందర్భంగా చార్మీ పెళ్లి ప్రపోజల్ తీసుకురాగా, త్రిష ఓకే చెప్పిన సంగతి అందరికీ తెలిసిందే.
అయితే తాజాగా.. చార్మీ ప్రపోజల్‌కు త్రిష ఎలా రియాక్ట్ అవుతుందా..? అని అటు త్రిష అభిమానులు, చార్మీ అభిమానులు ఆసక్తికరంగా వేచి చూస్తున్నారు. ఇదిలా ఉంటే.. త్రిష థర్టీ ప్లస్‌లో కూడా దక్షిణాది సినిమాల్లో రాణిస్తోంది. చార్మీ కౌర్ మాత్రం థర్టీలోపే నటనకు బాయ్ బాయ్ చేప్పేసి సినిమా ప్రొడక్షన్ రంగంవైపు మళ్లింది. ప్రస్తుతం స్టార్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్‌తో కలిసి హీరో రామ్‌తో ‘ఇస్మార్ట్ శంకర్’ మూవీ తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే.
Baby I love u today n forever ??
— Charmme Kaur (@Charmmeofficial) May 4, 2019
Am on my knees waiting for u to accept my proposal ?? let’s get married???? ( now toh it’s legally allowed also ?? ) #happybirthday @trishtrashers ???????? pic.twitter.com/e2F3Zn3Dp3
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout