జులై 9న బాబు బంగారం సింగిల్ ట్రాక్ విడుదల
Send us your feedback to audioarticles@vaarta.com
విక్టరి వెంకటేష్, నయనతార కాంబినేషన్ లో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్ లో నిర్మాత ఎస్.రాధాకృష్ణ (చినబాబు) సమర్పణలో, మారుతి దర్శకుడిగా సూర్యదేవర నాగ వంశి, పి.డి.వి.ప్రసాద్ లు సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం 'బాబు బంగారం'. ఒక్క సాంగ్ మినహ షూటింగ్ మెత్తం పూర్తయింది. జిబ్రాన్ అందించిన సింగిల్ ట్రాక్ ని జులై 9న విడుదల చేస్తున్నారు.
చిత్ర నిర్మాతలు మాట్లాడుతూ."విక్టరి వెంకటేష్, నయనతార కాంబినేషన్ అనగానే సూపర్‌డూపర్ హిట్ చిత్రంగా ట్రేడ్ లో క్రేజ్ వుంది. వరుస సూపర్‌హిట్ చిత్రాల దర్శకుడు మారుతి డైరక్షన్ అనగానే క్రేజ్ రెట్టింపయ్యింది. మా బ్యానర్ సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ పైన , ప్రముఖ నిర్మాత ఎస్.రాధాకష్ణ(చినబాబు) సమర్పణలో ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా నిర్మిస్తున్నాము. దీనికి సంభందించిన మెదటి లుక్ టీజర్ విపరీతంగా అన్ని వర్గాల ప్రేక్షకుల నుండి చాలా మంచి పాజిటివ్ బజ్ వచ్చింది. సోషల్ మీడియాలో టాప్ ట్రెండింగ్ వీడియోస్ లో ఇది నిలవటం చాలా హ్యపిగా వుంది.సౌత్ క్రేజి మ్యూజిక్ దర్శకుడు జిబ్రాన్ అందించిన సింగిల్ ట్రాక్ ని జులై 9 న ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తున్నాం. ఆడియో డేట్ ని త్వరలో ప్రకటిస్తాము. "అని అన్నారు
ఈ చిత్రంలో విక్టరి వెంకటేష్, నయనతార, షావుకారు జానకి, బ్రహ్మనందం, పోసాని కృష్ణ మురళి, పృద్వి, జయప్రకాష్, రఘుబాబు, బ్రహ్మజి, సంపత్, మురళి శర్మ, వెన్నెల కిషోర్, మున్నా వేణు, గిరిధర్, అనంత్, రాజా రవీంద్ర, రజిత, గుండు సుదర్శన్ నటించగా..
డాన్స్- బృంద, శేఖర్ , స్టంట్స్- రవి వర్మ , ఆర్ట్- రమణ వంక , ఎడిటర్- ఉద్దవ్.ఎస్.బి , పి.ఆర్.ఓ- ఎస్.కె.ఎన్, ఏలూరు శ్రీను , సంగీతం- జిబ్రాన్ , నిర్మాతలు- సూర్యదేవర నాగ వంశి, పి.డి.వి.ప్రసాద్ , కథ,కథనం,దర్శకత్వమ్ - మారుతి
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com