బాబు బంగారం రిలీజ్ డేట్ ఖరారు..
Send us your feedback to audioarticles@vaarta.com
విక్టరీ వెంకటేష్ - యువ దర్శకుడు మారుతి కాంబినేషన్లో రూపొందుతున్న చిత్రం బాబు బంగారం. ఈ చిత్రంలో వెంకటేష్ సరసన నయనతార నటించింది. సితార ఎంటర్ టైన్మెంట్స్ బ్యానర్ పై రూపొందుతుందున్న ఈ చిత్రానికి గిబ్రాన్ సంగీతం అందిస్తున్నారు.
భలే భలే మగాడివోయ్ సక్సెస్ తర్వాత మారుతి చేస్తున్న సినిమా కావడం...దీనికి తగ్గట్టు బాబు బంగారం ఫస్ట్ లుక్ కి మంచి స్పందన రావడంతో ఈ చిత్రం పై మంచి క్రేజ్ ఏర్పడింది. ఇదిలా ఉంటే...మూవీ మొఘల్ డా.డి.రామానాయుడు జయంతి పురస్కరించుకుని ఈరోజు బాబు...బంగారం టీజర్ రిలీజ్ చేసారు. ఈ టీజర్ కి అనూహ్యమైన రెస్పాన్స్ లభిస్తుండడంతో ఈ మూవీ పై అంచనాలు అమాంతం పెరిగిపోయాయి. వెంకీ స్టైల్ లో ఉండే ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా రూపొందుతున్న బాబు బంగారం చిత్రాన్ని జులై 29 న రిలీజ్ చేయనున్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Contact at support@indiaglitz.com
Comments