'బాబు బంగారం' సెన్సార్ పూర్తి...
Send us your feedback to audioarticles@vaarta.com
విక్టరీ వెంకటేష్ హీరోగా సితార ఎంటర్ టైన్మెంట్స్ బ్యానర్‌పై మారుతి దర్శకత్వంలో ఎస్.నాగవంశీ నిర్మిస్తున్న చిత్రం బాబు బంగారం`. లక్ష్మి, తులసి చిత్రాలు తర్వాత వెంకటేష్, నయనతార కలిసి నటిస్తున్న చిత్రమిది. భలేభలే మగాడివోయ్ సినిమా తర్వాత డైరెక్టర్ మారుతి దర్శకత్వంలో వస్తున్న ఈ ఎంటర్టైనర్ ఆగస్ట్ 12న గ్రాండ్ రిలీజ్ అవుతుంది. ఇప్పుడు ఈ సినిమా సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుని యు/ఎ సర్టిఫికేట్‌ను పొందింది. సెన్సార్ పూర్తి చేసుకోవడంతో సినిమా రిలీజ్ రూట్స్ అన్నీ క్లియర్ అయినట్టే. అయ్యో అయ్యో అయ్యయ్యో అనే బొబ్బిలిరాజా మేనరిజమ్‌తో సందడి చేయడానికి వస్తోన్న వెంకటేష్ బాబు..నిర్మాతల పాలిట బంగారం కావాలని కోరుకుందాం...
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Contact at support@indiaglitz.com
Comments