'బాబు బంగారం' సెన్సార్ పూర్తి...

  • IndiaGlitz, [Friday,August 05 2016]

విక్ట‌రీ వెంక‌టేష్ హీరోగా సితార ఎంట‌ర్ టైన్మెంట్స్ బ్యాన‌ర్‌పై మారుతి ద‌ర్శ‌క‌త్వంలో ఎస్‌.నాగ‌వంశీ నిర్మిస్తున్న చిత్రం బాబు బంగారం'. ల‌క్ష్మి, తుల‌సి చిత్రాలు త‌ర్వాత వెంక‌టేష్‌, న‌య‌న‌తార క‌లిసి న‌టిస్తున్న చిత్రమిది. భ‌లేభ‌లే మ‌గాడివోయ్ సినిమా త‌ర్వాత డైరెక్ట‌ర్ మారుతి ద‌ర్శ‌క‌త్వంలో వ‌స్తున్న ఈ ఎంట‌ర్‌టైన‌ర్ ఆగ‌స్ట్ 12న గ్రాండ్ రిలీజ్ అవుతుంది. ఇప్పుడు ఈ సినిమా సెన్సార్ కార్య‌క్ర‌మాల‌ను పూర్తి చేసుకుని యు/ఎ స‌ర్టిఫికేట్‌ను పొందింది. సెన్సార్ పూర్తి చేసుకోవ‌డంతో సినిమా రిలీజ్ రూట్స్ అన్నీ క్లియ‌ర్ అయిన‌ట్టే. అయ్యో అయ్యో అయ్య‌య్యో అనే బొబ్బిలిరాజా మేన‌రిజ‌మ్‌తో సంద‌డి చేయ‌డానికి వ‌స్తోన్న వెంక‌టేష్ బాబు..నిర్మాత‌ల పాలిట బంగారం కావాల‌ని కోరుకుందాం...