close
Choose your channels

వెంకటేష్ ను బాబు...బంగారం అని ఇప్పుడు అంటున్నారు కానీ...నేను ఆరోజే చెప్పాను - దర్శకరత్న దాసరి

Sunday, July 24, 2016 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com
విక్ట‌రీ వెంక‌టేష్ - యువ ద‌ర్శ‌కుడు మారుతి కాంబినేష‌న్లో రూపొందిన‌ ఫ్యామిలీ ఎంట‌ర్ టైన‌ర్ బాబు బంగారం. ఈ చిత్రంలో వెంక‌టేష్ స‌ర‌స‌న అందాల తార‌ న‌య‌న‌తార న‌టించింది. ఈ చిత్రాన్నిసితార‌ ఎంట‌ర్ టైన్మెంట్స్ బ్యాన‌ర్ పై రాథాకృష్ణ నిర్మించారు. గిబ్రాన్ మ్యూజిక్ అందించిన బాబు..బంగారం ఆడియో ఆవిష్క‌ర‌ణోత్స‌వం, విక్ట‌రీ ముప్పై వ‌సంతాల వేడుక సినీ ప్ర‌ముఖులు, అభిమానుల స‌మ‌క్షంలో శిల్ప క‌ళావేదిక‌లో ఘ‌నంగా జ‌రిగింది. ఈ కార్య‌క్ర‌మానికి ద‌ర్శ‌క‌ర‌త్న దాస‌రి నారాయ‌ణ‌రావు ముఖ్య అతిధిగా హాజ‌రై బాబు..బంగారం ఆడియో సిడీను ఆవిష్క‌రించి తొలి సిడీను నిర్మాత సురేష్ బాబుకు అంద‌చేయ‌గా...సురేష్ బాబు బాబు...బంగారం ధియేట్రిక‌ల్ ట్రైల‌ర్ ను రిలీజ్ చేసారు.
ఈ సంద‌ర్భంగా ద‌ర్శ‌క‌ర‌త్న దాస‌రి నారాయ‌ణ‌రావు మాట్లాడుతూ... వెంక‌టేష్ ను బాబు...బంగారం అని ఇప్పుడు అంటున్నారు కానీ...నేను బాబు..బంగారం అని ముప్పై సంవ‌త్స‌రాల క్రిత‌మే చెప్పాను. ఈ ఆడియో వేడుక‌ను చూస్తుంటే నిజంగా పండ‌గ‌లా ఉంది. వెంక‌టేష్ ముప్పై సంవ‌త్స‌రాలు స‌క్సెస్ ఫుల్ హీరో గా...అదీ ఎలాంటి కామెంట్స్, విమ‌ర్శ‌లు రాకుండా పూర్తి చేసుకోవ‌డం అభినందించ‌ద‌గ్గ విష‌యం. రామానాయుడు ఆశీస్సులు వ‌ల‌నే ఇది సాధ్యం అయ్యింది అనుకుంటున్నాను. రామ‌నాయుడుతో వాళ్ల కుటుంబంతో నాకు మంచి అనుబంధం ఉంది. ఒక నిర్మాత కొడుకు స్టార్ హీరోగా ఎద‌గ‌డం అదీ ముప్పై సంవ‌త్స‌రాలు స‌క్సెస్ ఫుల్ గా కంప్లీట్ చేసుకోవ‌డం అనేది ఇప్ప‌టి వ‌ర‌కు వెంక‌టేష్ కే సాధ్య‌మైంది. తెర పై క‌నిపించే వెంక‌టేష్ వేరు..తెర వెనుక వెంక‌టేష్ వేరు.నిర్మాత‌ల క‌ష్ట సుఖాలు తెలిసిన నిజ‌మైన హీరో వెంక‌టేష్. బ్ర‌హ్మ‌పుత్రుడు సినిమా షూటింగ్ కాశ్మీర్ లో జ‌రుగుతున్న‌ప్పుడు వెంక‌టేష్ కెమెరాను భుజం పై పెట్టుకుని లోకేష‌న్ కి న‌డిచి వెళ్లేవాడు. ఇలా ఏ హీరో చేస్తాడు.
ఒక్క మాట‌లో చెప్పాలంటే... క్ర‌మ‌శిక్ష‌ణ‌, ఆస‌క్తి, నిజాయితీ..ఈ మూడు క‌లిస్తే వెంక‌టేష్‌. సంస్థ‌ను బ‌ట్టి సినిమాలు చేయ‌లేదు..క‌థ‌ను న‌మ్మి క‌థ‌ను బ‌ట్టే సినిమాలు చేసాడు కాబ‌ట్టే వెంక‌టేష్ సక్సెస్ రేటు ఎక్కువ‌. ఎన్నో ఆణిముత్యాలు లాంటి సినిమాలు చేసాడు. ఉత్త‌మ న‌టుడుగా ఎక్కువ‌ నంది అవార్డులు అందుకున్నాడు. వెంక‌టేష్ ఇంత స‌క్సెస్ అవ్వ‌డానికి వెన‌క సురేష్ బాబు కృషి ఎంతో ఉంది. బాబు..బంగారం అని మారుతి ఎలా ఆలోచించి పెట్టాడో కానీ..వెంక‌టేష్ కి క‌రెక్ట్ టైటిల్. గిబ్రాన్ అన‌గానే పాటలు వెస్ట్ర‌న్ లో ఉంటాయి అనుకున్నాను కానీ...చాలా చ‌క్క‌గా ఉన్నాయి. చిన్న సినిమాతో స్టార్ట్ అయి ఒక్కొ్క్క మెట్టు ఎక్కుతూ ఈ సినిమా త‌ర్వాత స్టార్ డైరెక్ట‌ర్ అవ‌బోతున్న మారుతిని అభినందిస్తున్నాను. చిన‌బాబు మంచి నిర్మాత‌. మంచి టీమ్ క‌లిసి చేసిన బాబు..బంగారం పెద్ద విజయం సాధించాలి అన్నారు.
వెంక‌టేష్ మాట్లాడుతూ... ఇండ‌స్ట్రీకి వ‌చ్చి 30 సంవ‌త్స‌రాలు పూర్త‌య్యాయి అంటే... అప్పుడే 30 ఇయ‌ర్సా అనిపిస్తుంది. నేను ఆడియో ఫంక్ష‌న్స్ లో మాట్లాడ‌డం కోసం ఏం మాట్లాడాలో అని స్పీచ్ ప్రిపేర్ అయి రాను. ఆడియో ఫంక్ష‌న్స్ కి ఎందుకు వ‌స్తానంటే...అభిమానుల ప్రేమ కోసం..వాళ్ల క‌ళ్ల‌ల్లో ఆనందం చూడ‌డం కోసం వ‌స్తాను. నా ఫ‌స్ట్ ఫిల్మ్ నుంచి ఇప్ప‌టి వ‌ర‌కు న‌న్ను స‌పోర్ట్ చేసిన ప్ర‌తి ఒక్క‌రికి పేరు పేరున కృత‌జ్ఞ‌త‌లు తెలియ‌చేస్తున్నాను. గ‌త ఐదు సంవ‌త్స‌రాలు నుంచి సినిమాలు త‌గ్గించేయాలి అనుకున్నాను. కానీ...బాబు బంగారం ట్రైల‌ర్ చూస్తుంటే...ఇంకో 15 ఇయ‌ర్స్ సినిమాలు చేయాలి అనిపిస్తుంది. ప్రేమించుకుందాం రా..! బొబ్బిలి రాజా, నువ్వు నాకు న‌చ్చావ్..సినిమాల వ‌లే బాబు.. బంగారం చిత్రానికి ఘ‌న విజ‌యం అందిస్తార‌ని ఆశిస్తున్నాను.
ఈ సినిమా త‌ర్వాత న‌న్ను పెళ్లి కాని ప్ర‌సాద్ అని పిలుస్తారో, బాబు..బంగారం అని పిలుస్తారో చూడాలి. మారుతి సినిమా ప్రారంభం నుంచి ఇప్ప‌టి వ‌ర‌కు ఏమాత్రం టెన్ష‌న్ ప‌డ‌కుండా చాలా కూల్ గా ఈ మూవీని తెర‌కెక్కించాడు. చిన‌బాబు నా సినిమాకి నిర్మాత కావ‌డం అదృష్టంగా భావిస్తున్నాను. గిబ్రాన్ చాలా మంచి మ్యూజిక్ అందించాడు. బాబు...బంగారం ఆగ‌ష్టు 12న రిలీజ్ చేస్తున్నాం. బొబ్బిలి రాజా, చంటి, సీత‌మ్మ‌వాకిట్లో సిరిమ‌ల్లె చెట్టు..వీటిలో బాబు..బంగారం చిత్రానికి ఏరేంజ్ స‌క్సెస్ అందిస్తారో ప్రేక్ష‌కాభిమానుల చేతుల్లో ఉంది.మా అబ్బాయి అర్జున్ సినిమాల్లోకి వ‌చ్చే వ‌ర‌కు సినిమాలు చేస్తాను అన్నారు.
డైరెక్ట‌ర్ మారుతి మాట్లాడుతూ...వెంక‌టేష్ గారు 30 సంవ‌త్స‌రాలు పూర్తి చేసుకున్న త‌రుణంలో ఆయ‌న‌తో నేను సినిమా చేయ‌డం చాలా హ్యాపీగా ఉంది. క‌ల నెర‌వేరినంత ఆనందంగా ఉంది. మంచి సినిమా తీసాను. అభిమానులు అంద‌రూ గ‌ర్వ‌ప‌డేలా బాబు...బంగారం ఉంటుంది. న‌న్ను స్టార్ డైరెక్ట‌ర్ చేసిన వెంక‌టేష్ గారికి రుణ‌ప‌డి ఉంటాను. న‌య‌న‌తార త‌న పాత్ర‌కు ప్రాణం పోసారు. డార్లింగ్ స్వామి ఈ క‌థ బాగా రావ‌డానికి ఎంత‌గానో స‌హ‌క‌రించాడు. సురేష్ బాబు గారు ఎప్ప‌టిక‌ప్పుడు సినిమా ఎలా వ‌స్తుంది అని తెలుసుకుంటూ న‌న్ను ఒక ఫ్యామిలీ మెంబ‌ర్ లా ట్రీట్ చేసారు. దాసరి గారి చేతుల మీదుగా బాబు..బంగారం ఆడియో రిలీజ్ కావ‌డం చాలా సంతోషంగా ఉంది అన్నారు.
సంగీత ద‌ర్శ‌కుడు గిబ్రాన్ మాట్లాడుతూ...నాకు ఇది మూడో సినిమా. పెద్ద సినిమా చేసినందుకు చాలా ఆనందంగా ఉంది. నాకు అవకాశం ఇచ్చిన వెంక‌టేష్ గార్కి, మారుతి గార్కి థ్యాంక్స్ తెలియ‌చేస్తున్నాను అన్నారు.
సురేష్ బాబు మాట్లాడుతూ...30 సంవ‌త్స‌రాలుగా మ‌మ్మ‌ల్ని ఆద‌రిస్తున్న ఫ్యాన్స్ కి థ్యాంక్స్ తెలియ‌చేస్తున్నాను. బాబు..బంగారం టీమ్ కి ఆల్ ది బెస్ట్ అన్నారు.
దిల్ రాజు మాట్లాడుతూ...వెంక‌టేష్ గారు ఇంకా 20 సంవ‌త్స‌రాలు స‌క్సెస్ ఫుల్ మూవీస్ చేసి..50 సంవ‌త్స‌రాల వేడుక‌నే ఇదే వేదిక పై జ‌రుపుకోవాల‌ని కోరుకుంటున్నాను. 1986లో క‌లియుగ పాండ‌వులు సినిమాను ఓ ప్రేక్ష‌కుడిగా సుద‌ర్శ‌న్ థియేట‌ర్ లో చూసాను. నిర్మాత‌గా వెంక‌టేష్ గారితో సీత‌మ్మ‌వాకిట్లో సిరిమ‌ల్లె చెట్టు సినిమా చేయ‌డం గ్రేట్ ఫీలింగ్. బంగారం లాంటి టీమ్ తో చేసిన ఈ సినిమా ఆల్రెడీ స‌క్సెస్ అయిపోయిన‌ట్టు అనిపిస్తుంది అన్నారు.
నాని మాట్లాడుతూ.... స్ర్కీన్ పై క‌నిపించే హీరోను క‌లిసిన త‌ర్వాత ఇష్టం అనేది జ‌న‌ర‌ల్ గా త‌గ్గుతుంది కానీ..వెంక‌టేష్ గార్ని క‌లిసిన త‌ర్వాత ఇష్టం ఇంకా పెరిగిందే కానీ ఏమాత్రం త‌గ్గ‌లేదు. వెంక‌టేష్ గారు క్ష‌ణ క్ష‌ణం, నువ్వు నాకు న‌చ్చావ్, బొబ్బిలి రాజా త‌ర‌హా చిత్రాలు ఇంకా ఎక్కువ చేయాలి అని కోరుకుంటున్నాను క‌మ‌ర్షియ‌ల్ సినిమా అంటే మారుతి సినిమానే. బాబు..బంగారం క‌థ నాకు తెలుసు. ఈసారి ఖ‌చ్చితంగా హిట్ కొట్టేస్తున్నాం అన్నారు.
త‌మ్మారెడ్డి భ‌ర‌ద్వాజ మాట్లాడుతూ...మారుతి ఈరోజుల్లో సినిమాతో ఇండ‌స్ట్రీలో కొత్త ఒర‌వ‌డి తీసుకువ‌చ్చాడు. సినిమా సినిమాకి ఎదుగుతూ ఇప్పుడు వెంక‌టేష్ తో సినిమా చేయ‌డం ఆనందంగా ఉంది. వెంక‌టేష్ సినిమాల్లో 90% సినిమాలు స‌క్సెస్ సాధించాయి. బాబు..బంగారం కూడా హిట్ అవుతుంది అన్నారు.
ఈ కార్య‌క్ర‌మంలో భీమ‌నేని శ్రీనివాస‌రావు, కె.వి.వి.స‌త్య‌నారాయ‌ణ‌, ముప్ప‌ల‌నేని శివ‌, లావ‌ణ్య త్రిపాఠి త‌దిత‌రులు పాల్గొన్నారు.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.   

Comments

Welcome to IndiaGlitz comments! Please keep conversations courteous and relevant to the topic. To ensure productive and respectful discussions, you may see comments from our Community Managers, marked with an "IndiaGlitz Staff" label. For more details, refer to our community guidelines.
settings
Login to post comment
Cancel
Comment