'బాబు బాగా బిజీ' ప్రీ రిలీజ్ ఫంక్షన్
- IndiaGlitz, [Thursday,April 27 2017]
అభిషేక్ పిక్చర్స్ బ్యానర్‌పై అవసరాల శ్రీనివాస్ హీరోగా వినూత్న కథతో నిర్మించిన చిత్రం 'బాబు బాగా బిజీ'. బాలీవుడ్ హిట్ చిత్రం 'హంటర్' చిత్రానికి తెలుగు రీమేక్ ఇది. నవీన్ మేడారం దర్శకుడిగా పరిచయమౌతున్న ఈ చిత్రంలో మిస్తీ చక్రవర్తి, తేజస్వి మదివాడ, సుప్రియ ఐసోల, శ్రీ ముఖి హీరోయిన్లుగా నటిస్తున్నారు. మే 5న ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నారు. ఈ సందర్భంగా బుధవారం హైదరాబాద్‌లో ప్రీ రిలీజ్ ఫంక్షన్ జరిగింది. ఈ కార్యక్రమంలో చిత్రయూనిట్ పాల్గొంది.
ఇలాంటి కాన్సెప్ట్ సినిమాలు చేస్తే సినిమాలు విజయం సాధిస్తాయనే ఆలోచన 'బాబు బాగా బిజీ' సినిమా చేయలేదు. రేపు సినిమా విడుదలైన తర్వాత ఆ విషయం అందరికీ తెలుస్తుంది. ఈ సినిమా ఎందుకు చేస్తున్నారని చాలా మంది అడిగారు. నేను నా ఇంజనీరింగ్ పూర్తికాగానే సోషల్ సైకాలజీలో మాస్టర్స్ స్టార్ట్ చేసి ఆపేశాను కానీ నాకు జనాన్ని స్టడీ చేయడమంటే చాలా ఇష్టం. అందువల్లనే సినిమా రంగంలోకి వచ్చాను. బాబుబాగా బిజీలో సైకాలాజికల్ కంటెంట్ బాగా ఉంది. చాలా ఇంట్రెస్టింగ్ క్యారెక్టర్ కాబట్టే నేను సినిమా చేశాను. దర్శక నిర్మాతలు సినిమాపై ఎక్కడా టెంప్ట్ కాకుండా సినిమాను పూర్తి చేశారు. ఈ సినిమాలో చేసిన మిస్తి, సుప్రియ, తేజస్వి మడివాడ అందరూ గౌరవంతో పనిచేశారు. సునీల్‌గారు అద్భుతమైన మ్యూజిక్ ఇచ్చారు. టీజర్, ట్రైలర్‌కు చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. నేను ఫలితం ఆశించకుండా సినిమాలు చేశానని హీరో అవసరాల శ్రీనివాస్ తెలిపారు. .
హంటర్ సినిమాను తెలుగులో రీమేక్ చేయాలంటే గట్స్ కావాలి. దర్శకుడిగా నాకిది తొలి చిత్రం. ఇలాంటి సినిమాను చేయడానికి కారణం నిర్మాత అభిషేక్‌గారే. ముగ్గురు స్నేహితులు కలిసి మాట్లాడుకునేటప్పుడు ఎలా ఉంటుందో సినిమా అలా ఉంటుంది. అవసరాలగారు తప్ప మరెవరినీ ఈ రోల్‌లో ఊహించుకోలేదు. ఆయన కూడా సినిమా చూడగానే సినిమా చూడటానికి సిద్ధమయ్యారు. సినిమాలో వల్గారిటీ కనపడదు. మిస్తి, తేజస్విని మడివాడ, సుప్రియ చక్కగా నటించారు. సినిమా చూస్తుంటే రియల్ లైఫ్‌ను చూస్తున్నట్లు అనిపిస్తుంది. సునీల్ కశ్యప్‌కు క్లాసికల్ మ్యూజిక్‌లో మంచి పట్టున్న మ్యూజిక్ డైరెక్టర్. పది సాంగ్స్ ఉన్నాయి. ప్రతి సాంగ్ ఎంతో బ్యూటీఫుల్‌గా ఉంటుంది. కరుణాకర్ అడిగర్ల ఒక సాంగ్ మినహా అన్నీ తనే చక్కటి సాహిత్యమిచ్చాడు. ఒక సాంగ్‌ను సుద్ధాల అశోక్‌తేజగారు రాశారు. బాలు మహేంద్రగారి వద్ద 15 సంవత్సరాలు పనిచేసిన సురేష్ భార్గవ ప్రతి సీన్‌ను గొప్పగా చూపించాడుని దర్శకుడు నవీన్ మేడారం అన్నారు.
ఈ కార్యక్రమంలో శ్రీముఖి, సుప్రియ, తనికెళ్ళ భరణి, రఫీ, ప్రియదర్శన్, మాస్టర్ నిఖిల్, శివరాం, వీరయ్యనాయుడు తదితరులు పాల్గొన్నారు.