బాహుబలి 2 యుద్ధం ప్రారంభం..
Monday, June 13, 2016 తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com
Send us your feedback to audioarticles@vaarta.com
ప్రభాస్, రానా, అనుష్క, తమన్నా, రమ్యకృష్ణ ప్రధాన పాత్రధారులుగా రాజమౌళి తెరకెక్కించిన సంచలన చిత్రం బాహుబలి. ప్రపంచ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన బాహుబలి చిత్రం పార్ట్ 2 క్లైమాక్స్ చిత్రీకరణ ఈరోజు ప్రారంభమైంది. బాహుబలి టీమ్ సమ్మర్ హాలీడేస్ పూర్తవ్వడంతో రామోజీ ఫిలింసిటీలో షూటింగ్ స్టార్ట్ చేసారు.
ఈ సినిమా క్లైమాక్స్ కోసం టీమ్ కి కొన్ని రోజులు ట్రైనింగ్ ఇచ్చారు. ట్రైనింగ్ పూర్తవ్వడంతో షూటింగ్ స్టార్ట్ చేసారు. షైట్ మాస్టర్ జీతూ వర్మ నేతృత్వంలో పది వారాల పాటు యుద్ద సన్నివేశాలను చిత్రీకరించనున్నారు. మొత్తం బడ్జెట్ తో ముప్పై శాతం బడ్జెట్ ను యుద్ద సన్నివేశాలకే ఖర్చు చేస్తున్నట్టు సమాచారం. బాహుబలి ఇచ్చిన స్పూర్తితో అంతకు మించి..విజయం సాధించేలా రాజమౌళి బాహుబలి 2 చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. మరి...బాహుబలి 2 ఏరేంజ్ సక్సెస్ సాధిస్తుందో తెలియాలంటే వచ్చే సంవత్సరం వరకు ఆగాల్సిందే.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments