భారీ రేటుకు బాహుబలి 2కు తమిళ వెర్షెన్ రైట్స్..

  • IndiaGlitz, [Wednesday,August 03 2016]

ప్ర‌భాస్, రానా, అనుష్క‌, త‌మ‌న్నా, ర‌మ్య‌కృష్ణ ప్ర‌ధాన పాత్ర‌ల్లో ద‌ర్శ‌క‌ధీర రాజ‌మౌళి తెర‌కెక్కించిన బాహుబ‌లి చిత్రం ప్ర‌పంచ వ్యాప్తంగా ఎంత‌టి సంచ‌ల‌నం సృష్టించిందో తెలిసిందే. బాహుబ‌లి ఇచ్చిన సంచ‌ల‌న విజ‌యంతో బాహుబ‌లి 2 చిత్రాన్ని మ‌రింత భారీ స్ధాయిలో రూపొందిస్తున్నారు. ప్ర‌స్తుతం రామోజీ ఫిలిం సిటీలో క్లైమాక్స్ సీన్స్ చిత్రీక‌రిస్తున్నారు. ఇదిలా ఉంటే...బాహ‌బ‌లి చిత్రం త‌మిళ‌నాడులో కూడా సంచ‌ల‌న విజ‌యం సాధించ‌డంతో బాహుబ‌లి 2 చిత్రానికి త‌మిళ‌నాడులో మంచి క్రేజ్ ఏర్ప‌డింది. అందుక‌నే బాహుబ‌లి 2 త‌మిళ‌నాడు థియేట్రిక‌ల్ రైట్స్ & శాటిలైట్స్ క‌లిపి 45 కోట్ల‌కు దక్కించుకున్న‌ట్టు సమాచారం. అయితే...బాహుబ‌లి 2 త‌మిళ రైట్స్ ద‌క్కించుకున్న‌ది ఎవ‌ర‌నేది ఇంకా తెలియాల్సి ఉంది. అత్యంత ప్ర‌తిష్టాత్మ‌కంగా రూపొందుతున్న సంచ‌ల‌న చిత్రం బాహుబ‌లి 2 ని వ‌చ్చే స‌మ్మ‌ర్ లో ప్ర‌పంచ వ్యాప్తంగా రిలీజ్ చేయ‌డానికి ప్లాన్ చేస్తున్నారు.

More News

చిరంజీవి గారు అలా...ఎందుకు అన్నారో నాకు అర్ధం కాలేదు - అల్లు శిరీష్

గౌరవం చిత్రంతో హీరోగా పరిచయమై...కొత్త జంట సినిమాతో విజయం సాధించిన యువ హీరో అల్లు శిరీష్.తాజాగా అల్లు శిరీష్ శ్రీరస్తు శుభమస్తు అనే చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు.

ప్రవీణ్ సత్తార్ దర్శకత్వంలో డా.రాజశేఖర్ కొత్త చిత్రం

చందమామ కథలు వంటి నేషనల్ అవార్డ్ విన్నింగ్ మూవీని తెరకెక్కించిన దర్శకుడు ప్రవీణ్ సత్తార్

జనతా గ్యారేజ్ ఆడియో విడుదలకు ముహుర్తం ఖరారు..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో రూపొందుతున్న భారీ క్రేజీ మూవీ జనతా గ్యారేజ్.ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ నిర్మిస్తుంది.

సంతోషం అవార్డ్స్ ఫంక్షన్ సాంగ్ ను రిలీజ్ చేసిన హీరో నిఖిల్

ఎప్పటికప్పుడు తాజా వార్తావిశేషాలను అందిస్తూ...ప్రతి సంవత్సరం అవార్డ్స్ అందిస్తూ...తనకంటూ ఓ ప్రత్యేక తను సొంతం చేసుకున్న ప్రముఖసినీవార పత్రిక సంతోషం.

ఇద్దరికీ ఒకటే....

ఎన్టీఆర్,సమంత ఇప్పుడు కొరటాల శివ దర్శకత్వంలో జనతాగ్యారేజ్ లో నటిస్తున్నారు.