భారీ రేటుకు బాహుబలి 2కు తమిళ వెర్షెన్ రైట్స్..
Wednesday, August 3, 2016 తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com
Send us your feedback to audioarticles@vaarta.com
ప్రభాస్, రానా, అనుష్క, తమన్నా, రమ్యకృష్ణ ప్రధాన పాత్రల్లో దర్శకధీర రాజమౌళి తెరకెక్కించిన బాహుబలి చిత్రం ప్రపంచ వ్యాప్తంగా ఎంతటి సంచలనం సృష్టించిందో తెలిసిందే. బాహుబలి ఇచ్చిన సంచలన విజయంతో బాహుబలి 2 చిత్రాన్ని మరింత భారీ స్ధాయిలో రూపొందిస్తున్నారు. ప్రస్తుతం రామోజీ ఫిలిం సిటీలో క్లైమాక్స్ సీన్స్ చిత్రీకరిస్తున్నారు. ఇదిలా ఉంటే...బాహబలి చిత్రం తమిళనాడులో కూడా సంచలన విజయం సాధించడంతో బాహుబలి 2 చిత్రానికి తమిళనాడులో మంచి క్రేజ్ ఏర్పడింది. అందుకనే బాహుబలి 2 తమిళనాడు థియేట్రికల్ రైట్స్ & శాటిలైట్స్ కలిపి 45 కోట్లకు దక్కించుకున్నట్టు సమాచారం. అయితే...బాహుబలి 2 తమిళ రైట్స్ దక్కించుకున్నది ఎవరనేది ఇంకా తెలియాల్సి ఉంది. అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపొందుతున్న సంచలన చిత్రం బాహుబలి 2 ని వచ్చే సమ్మర్ లో ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Contact at support@indiaglitz.com
Comments