బాహుబలి 2 ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ డేట్..!
Send us your feedback to audioarticles@vaarta.com
ప్రభాస్, రానా, అనుష్క, తమన్నా, రమ్యకృష్ణ ప్రధాన తారాగణంగా దర్శకధీర రాజమౌళి తెరకెక్కిస్తున్నసంచలన చిత్రం బాహుబలి 2. ప్రస్తుతం రామోజీ ఫిలింసిటీలో క్లైమాక్స్ సీన్స్ చిత్రీకరిస్తున్నారు. భారీ స్ధాయిలో యుద్ధ సన్నివేశాలను చిత్రీకరిస్తున్న ఈ షెడ్యూల్ ఈ నెలాఖరుకు పూర్తవుతుంది. ఆతర్వాత సెప్టెంబర్ నుంచి నవంబర్ వరకు చివరి షెడ్యూల్ ప్లాన్ చేస్తున్నారు.
బాహుబలి 2 గురించి లేటెస్ట్ న్యూస్ ఏమిటంటే....యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ పుట్టినరో్జు సందర్భంగా అక్టోబర్ 23న బాహుబలి 2 ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ చేయనున్నారు. త్వరలోనే ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ డేట్ ను అఫిషియల్ గా ఎనౌన్స్ చేయనున్నారని సమాచారం. ఆర్కా మీడియా సంస్థ అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న బాహుబలి 2 చిత్రాన్నిప్రపంచ వ్యాప్తంగా ఏప్రిల్ లో రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Contact at support@indiaglitz.com
Comments