సీక్వెల్ స్టోరీ రెడీ చేస్తున్న బాహుబలి రైటర్..!
Tuesday, November 15, 2016 తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com
Send us your feedback to audioarticles@vaarta.com
విక్రమార్కుడు సినిమా రవితేజ కెరీర్ లో మరచిపోలేని సినిమా. రాజమౌళి దర్శకత్వంలో రూపొందిన ఈ మూవీ తమిళ, కన్నడ, హిందీ ఇలా...ఏ భాషలో రీమేక్ చేసినా హిట్ అయ్యింది. ఇప్పుడు ఈ మూవీకి సీక్వెల్ స్టోరీ రాస్తున్నారట బాహుబలి రైటర్ విజయేంద్రప్రసాద్. ఈ చిత్రానికి రాజమౌళి దర్శకత్వం వహించకపోయినా రాజమౌళి శిష్యుడు దర్శకత్వం వహించనున్నట్టు సమాచారం.
రాజమౌళి సన్నిహితుడు సాయి కొర్రపాటి ఈ సీక్వెల్ ను నిర్మించేందుకు ఆసక్తి చూపిస్తున్నారట. బెంగాల్ టైగర్ చిత్రం రిలీజై సంవత్సరం దాటినా మాస్ మహరాజా రవితేజ సినిమా సెట్స్ పైకి వెళ్లలేదు. ఏ ప్రాజెక్ట్ అనుకున్నా...ఏదో కారణంతో ఆగిపోతుంది. ఇన్నాళ్లు ఓ మంచి ప్రాజెక్ట్ కోసం ఎదురు చూస్తున్న రవితేజకు విక్రమార్కుడు సీక్వెల్ అనేది మంచి ప్రాజెక్ట్. మరి...ఈ ప్రాజెక్ట్ తో అయినా రవితేజ సినిమా స్టార్ట్ చేస్తాడేమో చూడాలి..!
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Contact at support@indiaglitz.com
Comments