'బాహుబలి 2' యు.ఎస్ , కెనడా హక్కులు చేతులు మారాయి....

  • IndiaGlitz, [Tuesday,October 04 2016]

తెలుగు సినిమా స్థాయిని ప్ర‌పంచ స్థాయికి తీసుకెళ్ళిన సినిమా బాహుబ‌లి2- ది క‌న్‌క్లూజ‌న్‌. ప్ర‌భాస్, రాజ‌మౌళి, అనుష్క‌, త‌మ‌న్నా, సత్యరాజ్‌, రానా, ర‌మ్య‌కృష్ణ‌, నాజ‌ర్ ప్ర‌ధాన పాత్ర‌ధారులుగా రూపొందిన ఈ చిత్రం పార్ట్ 1, 600 కోట్ల క‌లెక్ష‌న్స్‌తో సెన్సేష‌న్ క్రియేట్ చేసి అంద‌రి దృష్టిని త‌న వైపుకు తిప్పుకుంది. ఇప్పుడంద‌రూ బాహుబ‌లి2 ఎప్పుడు రిలీజ్ అవుతుంద‌ని ఆస‌క్తిగా ఎదురుచూస్తున్నారు. బాహుబ‌లిని క‌ట్ట‌ప్ప ఎందుకు చంపాడ‌నే స‌స్పెన్స్‌కు తొల‌గిపోతుంద‌ని ఒక‌వైపుంటే, మ‌రో వైపు ఎన్ని కోట్లు క‌లెక్ష‌న్స్‌ను సాధిస్తుంద‌నేది మ‌రో విష‌యం. విజువ‌ల్ వ‌ర్చువ‌ల్ టెక్నాల‌జీతో రూపొందుతోన్న ఈ చిత్రం ఏప్రిల్ 28న 2017న విడుద‌ల కానుంది. చిత్రీక‌ర‌ణ తుదిద‌శ‌కు చేరుకుంది. డిసెంబ‌ర్ రెండు వారాల్లో సినిమా చిత్రీక‌ర‌ణ అంతా పూర్త‌వుతుంద‌ని అంటున్నారు.

బిజినెస్ విష‌యంలో కూడా బాహుబ‌లి2 కొత్త రికార్డుల‌ను క్రియేట్ చేస్తుంది. ముఖ్యంగా తాజా స‌మాచారం ప్ర‌కారం యు.ఎస్‌, కెన‌డాల్లో తెలుగు, త‌మిళం, మల‌యాళ హ‌క్కుల‌ను గ్రేట్ ఇండియా ఫిలింస్ డిస్ట్రిబ్యూష‌న్ సంస్థ 45 కోట్ల రూపాయ‌ల‌ను చేజిక్కించుకుంద‌ని స‌మాచారం. ఆస‌క్తిక‌ర‌మైన విష‌య‌మేమంటే కె- ఎంట‌ర్‌టైన్మెంట్ సంస్థ ఓవ‌ర్ సీస్ హ‌క్కుల‌ను చేజిక్కించ‌కుంద‌ట‌. ఈ హ‌క్కుల‌ను ఆర్కామీడియా మ‌ళ్లీ కొని గ్రేట్ ఇండియా ఫిలింస్‌కు భారీ రేటుకు అమ్మింద‌ని వార్త‌లు విన‌ప‌డుతున్నాయి.

More News

2.0 క్లైమాక్స్ పూర్తి....

సూపర్ స్టార్ రజనీకాంత్,శంకర్,అక్షయ్ కుమార్,ఎమీజాక్సన్ కాంబినేషన్ లో రూపొందుతోన్న భారీ చిత్రం 2.0 సీక్వెల్ ఆఫ్ రోబో. ప్రస్తుతం చిత్రీకరణ దశ లో ఉన్న ఈ చిత్రానికి సంబంధించిన క్లైమాక్స్ ఫైట్ రీసెంట్ గా పూర్తయ్యింది.

యప్ టీవీ బ్రాండ్ అంబాసిడర్ గా సూపర్ స్టార్ మహేష్ బాబు..!

దక్షిణాసియా కంటెంట్ ను కలిగిన ప్రపంచపు అతి పెద్ద ఆన్ లైన్ స్ట్రీమింగ్ వేదిక అయినటువంటి యప్ టీవీ టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబును బ్రాండ్ అంబాసిడర్ గా ప్రకటించింది.

నరుడా డోనరుడా - 2 మిలియన్ వ్యూస్..!

అక్కినేని ఫ్యామిలీ హీరో సుమంత్ నటించిన తాజా చిత్రం నరుడా డోనరుడా.

అమృత్ సర్ లో అభినేత్రి టీమ్..!

తమన్నా,ప్రభుదేవా,సోనూసూద్ ప్రధాన తారాగణంగా విజయ్ తెరకెక్కించిన విభిన్నకథా చిత్రం అభినేత్రి.

ఉగ్రవాదం ప్రపంచానికే శత్రువు - బాలకృష్ణ

ఉగ్రవాద చొరబాటు శిబిరాల పై మెరుపుదాడులు చేసి విజయం సాధించిన భారత సైన్యానికి దేశం యావత్తు జై కొడుతుంది.