'బాహుబలి 2' యు.ఎస్ , కెనడా హక్కులు చేతులు మారాయి....
Send us your feedback to audioarticles@vaarta.com
తెలుగు సినిమా స్థాయిని ప్రపంచ స్థాయికి తీసుకెళ్ళిన సినిమా బాహుబలి2- ది కన్‌క్లూజన్. ప్రభాస్, రాజమౌళి, అనుష్క, తమన్నా, సత్యరాజ్, రానా, రమ్యకృష్ణ, నాజర్ ప్రధాన పాత్రధారులుగా రూపొందిన ఈ చిత్రం పార్ట్ 1, 600 కోట్ల కలెక్షన్స్‌తో సెన్సేషన్ క్రియేట్ చేసి అందరి దృష్టిని తన వైపుకు తిప్పుకుంది. ఇప్పుడందరూ బాహుబలి2 ఎప్పుడు రిలీజ్ అవుతుందని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. బాహుబలిని కట్టప్ప ఎందుకు చంపాడనే సస్పెన్స్‌కు తొలగిపోతుందని ఒకవైపుంటే, మరో వైపు ఎన్ని కోట్లు కలెక్షన్స్‌ను సాధిస్తుందనేది మరో విషయం. విజువల్ వర్చువల్ టెక్నాలజీతో రూపొందుతోన్న ఈ చిత్రం ఏప్రిల్ 28న 2017న విడుదల కానుంది. చిత్రీకరణ తుదిదశకు చేరుకుంది. డిసెంబర్ రెండు వారాల్లో సినిమా చిత్రీకరణ అంతా పూర్తవుతుందని అంటున్నారు.
బిజినెస్ విషయంలో కూడా బాహుబలి2 కొత్త రికార్డులను క్రియేట్ చేస్తుంది. ముఖ్యంగా తాజా సమాచారం ప్రకారం యు.ఎస్, కెనడాల్లో తెలుగు, తమిళం, మలయాళ హక్కులను గ్రేట్ ఇండియా ఫిలింస్ డిస్ట్రిబ్యూషన్ సంస్థ 45 కోట్ల రూపాయలను చేజిక్కించుకుందని సమాచారం. ఆసక్తికరమైన విషయమేమంటే కె- ఎంటర్టైన్మెంట్ సంస్థ ఓవర్ సీస్ హక్కులను చేజిక్కించకుందట. ఈ హక్కులను ఆర్కామీడియా మళ్లీ కొని గ్రేట్ ఇండియా ఫిలింస్‌కు భారీ రేటుకు అమ్మిందని వార్తలు వినపడుతున్నాయి.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout