బాహుబలి రీమేక్ వస్తోంది
Send us your feedback to audioarticles@vaarta.com
బాహుబలి, బాహుబలి 2 చిత్రాలు ఎంతటి సంచలన విజయం సాధించాయో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ప్రభాస్, అనుష్క, తమన్నా, రానా, రమ్యకృష్ణ, సత్య రాజ్.. ఇలా భారీ తారాగణంతో తెరకెక్కిన ఈ చిత్రాన్ని దర్శకమౌళి రాజమౌళి జనరంజకంగా తెరకెక్కించారు. వసూళ్ల పరంగా భారతీయ చిత్ర సీమలో కొత్త అధ్యాయాన్ని లిఖించిన ఈ మూవీని.. భోజ్‌పురి భాషలో రీమేక్ చేస్తున్నారు.
భోజ్‌పురి నటుడు దినేశ్‌లాల్ యాదవ్ ఈ చిత్రాన్ని రీమేక్ చేయడానికి రైట్స్ సొంతం చేసుకున్నారు. తన ఫేస్‌బుక్ ద్వారా ఈ విషయాన్ని వెల్లడిస్తూ సెట్స్‌లోని ఫొటోను కూడా షేర్ చేశారు. అంతే కాకుండా.. ఈ చిత్రానికి వీర్ యోధ మహాబలి` అనే టైటిల్‌ను ఖరారు చేసినట్లు తెలిపారు. ప్రస్తుతం మహారాష్ట్రలోని ఓ గ్రామంలో.. ఈ సినిమా ప్రోమోలకు సంబంధించిన షూటింగ్ జరుగుతోంది. వచ్చే ఏడాది జనవరి 15న టీజర్‌ని రిలీజ్ చేయనున్నారు. ఇక్బాల్ భక్ష్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో ఆమ్రపాలి దుబే కథానాయికగా నటిస్తోంది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com