బాహుబలి రీమేక్ వస్తోంది

  • IndiaGlitz, [Friday,December 22 2017]

బాహుబ‌లి, బాహుబ‌లి 2 చిత్రాలు ఎంత‌టి సంచ‌ల‌న విజ‌యం సాధించాయో ప్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు. ప్ర‌భాస్‌, అనుష్క‌, త‌మ‌న్నా, రానా, ర‌మ్య‌కృష్ణ‌, స‌త్య రాజ్‌.. ఇలా భారీ తారాగ‌ణంతో తెర‌కెక్కిన ఈ చిత్రాన్ని ద‌ర్శ‌క‌మౌళి రాజ‌మౌళి జ‌న‌రంజ‌కంగా తెర‌కెక్కించారు. వ‌సూళ్ల ప‌రంగా భార‌తీయ చిత్ర సీమ‌లో కొత్త అధ్యాయాన్ని లిఖించిన ఈ మూవీని.. భోజ్‌పురి భాష‌లో రీమేక్ చేస్తున్నారు.

భోజ్‌పురి నటుడు దినేశ్‌లాల్‌ యాదవ్ ఈ చిత్రాన్ని రీమేక్‌ చేయడానికి రైట్స్ సొంతం చేసుకున్నారు. త‌న‌ ఫేస్‌బుక్‌ ద్వారా ఈ విషయాన్ని వెల్లడిస్తూ సెట్స్‌లోని ఫొటోను కూడా షేర్‌ చేశారు. అంతే కాకుండా.. ఈ చిత్రానికి వీర్‌ యోధ మహాబలి' అనే టైటిల్‌ను ఖరారు చేసినట్లు తెలిపారు. ప్రస్తుతం మహారాష్ట్రలోని ఓ గ్రామంలో.. ఈ సినిమా ప్రోమోలకు సంబంధించిన షూటింగ్ జరుగుతోంది. వ‌చ్చే ఏడాది జనవరి 15న టీజర్‌ని రిలీజ్ చేయ‌నున్నారు. ఇక్బాల్‌ భక్ష్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న ఈ చిత్రంలో ఆమ్రపాలి దుబే క‌థానాయిక‌గా న‌టిస్తోంది.

More News

చరణ్ , కొరటాల చిత్రానికి ముహుర్తం కుదిరిందా?

మిర్చి,శ్రీమంతుడు,జనతా గ్యారేజ్ చిత్రాలతో హ్యాట్రిక్ డైరెక్టర్గా పేరు తెచ్చుకున్నారు కొరటాల శివ

నయనతార పాత్ర పేరేమిటంటే..

సింహా,శ్రీ రామ రాజ్యం వంటి విజయవంతమైన చిత్రాల తరువాత నటసింహ నందమూరి బాలకృష్ణ,కోలీవుడ్ లేడీ సూపర్ స్టార్ నయనతార కాంబినేషన్ లో

ప‌వ‌న్.. ఆ రెండు ఒకేలా..

ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్‌.. ప‌రిచ‌యం అక్క‌ర్లేని పేరిది. ప‌వ‌న్ నుంచి ఓ సినిమా వ‌స్తుందంటే.. విడుద‌ల‌ రోజు థియేటర్ల వ‌ద్ద‌ పండ‌గ వాతావ‌ర‌ణం నెల‌కొంటుంది.

మెగా హీరో చిత్రంలో రమ్యకృష్ణ?

చక్రవర్తి చిత్రంలో మెగాస్టార్ చిరంజీవికి చెల్లెలుగా నటించిన రమ్యకృష్ణ..

పాట పూర్తి చేసిన ప‌వ‌న్‌

ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్‌.. ఓ మ‌ల్టీటాలెంటెడ్ ప‌ర్స‌న్ అని ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. క‌థానాయ‌కుడిగానే ప‌రిమితం కాకుండా ర‌చ‌న‌, ద‌ర్శ‌క‌త్వం, గానం.. ఇలా ప‌లు విభాగాల్లో ప‌వ‌న్ రాణించారు. ప‌వ‌న్ పాడిన పాట‌లన్నీ కూడా క్లిక్ అయ్యాయి. ఇక త‌న 25వ చిత్రం అజ్ఞాత‌వాసిలోనూ ఓ పాట పాడారు ప‌వ‌న్‌.