ఆ రికార్డ్ సాధించే దిశగా బాహుబలి

  • IndiaGlitz, [Saturday,July 11 2015]

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా రాజమౌళి దర్శకత్వంలో రూపొందిన విజువల్ వండర్ బాహుబలి' అంచనాలను మించుతూ రికార్డ్ కలెక్షన్స్ సాధిస్తుంది. బెనిఫిట్ షో నుండి తిరుగులేని క్రేజ్ తో వసూళ్ల పరంగా సరికొత్త రికార్డులకు కేరాఫ్ అడ్రస్ అవుతుంది. తొలిరోజున ఓవర్ సీస్ లో వన్ మిలియన్ డాలర్స్ ను కలెక్ట్ చేసిన ఈ మూవీ అక్కడ న్యూ ట్రెండ్ సెట్ చేసింది. ప్రభాస్ ఫ్యాన్స్ ప్రభంజనం, ఇప్పటి వరకు ప్లాప్ సినిమా అంటే ఎరుగని దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో ఈ సినిమా రూపొందడంతో అభిమానులు, ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.

అందుకు తగినట్టుగానే రాజమౌళి సినిమాని విజువల్ ఫీస్ట్ గా మలిచాడు. తెలుగు, తమిళం, హిందీ, మలయాళంల్లో దాదాపు నాలుగు వేల స్క్రీన్స్ లో విడుదలై ఈ చిత్రం తెలుగులోనే తొలిరోజున 30 కోట్ల రూపాయలను కలెక్ట్ చేసింది. తమిళం, హిందీ, మలయాళంలతో కలుపుకుంటే ఈ సినిమా డొమెస్టిక్ లో 50 కోట్ల రూపాయలను, ఓవర్ సీస్ లో ఇప్పటి వరకు 16కోట్లు కలెక్ట్ చేసి మొత్తంగా 66 కోట్ల రూపాయలను వసూలు చేసిందని ట్రేడ్ వర్గాల అభిప్రాయం.

ఈ ప్రభంజనం ఇలాగే కొనసాగితే సౌతిండియాలో కొత్త రికార్డులను నెలకొల్పడమే కాకుండా తొలి మూడు రోజుల్లో వందకోట్ల రూపాయలను కలెక్ట్ చేస్తుందని ఈ వర్గాలు అభిప్రాయ పడుతున్నాయి. వందకోట్ల కలెక్షన్స్ సాధించే చిత్రంగా ఈ ఘనతను అందుకోనున్న తొలి తెలుగు సినిమా ఇదే కానుంది.

More News

అమీర్ ఖాన్ ని కొట్టిన ప్రభాస్

ఇండియాస్ బిగ్గెస్ట్ మోషన్ పిక్చర్ గా విడుదలైన బాహుబలి ప్రభంజనం చాటుకుంటుంది. తొలి ఆట నుండే రికార్డ్ కలెక్షన్స్ ను సాధిస్తూ దూసుకెళ్తుంది.

అఖిల్ నెక్స్ ట్ మూవీ దర్శకుడు ఫిక్స్ అయ్యాడా?

అక్కినేని యంగ్ తరగంగం అఖిల్ అక్కినేని ప్రస్తుతం వి.వి.వినాయక్ మూవీ ద్వారా తెలుగు తెరకు పరిచయం అవుతున్నాడు.

బాలకృష్ణ డేట్ ఫిక్స్

‘లెజండ్’, ‘లయన్’ వంటి వరుస విజయాలు తర్వాత నటసింహ నందమూరి బాలకృష్ణ చేస్తున్న సినిమా ‘డిక్టేటర్’.

రాజమౌళి ఆ పని కూడా కానిచ్చేశాడు...

తొలి చిత్రం ‘స్టూడెంట్ నెం.1’ నుండి నేటి ‘బాహుబలి’ వరకు రాజమౌళి ప్రతి చిత్రాన్ని సక్సెస్ దిశగానడిపించిన దర్శకుడు.

'బాహుబలి' మూవీ రివ్యూ

ఇప్పటి వరకు ఓటమి ఎరుగని ధీరుడు రాజమౌళి దర్శకత్వంలో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా రూపొందిన చిత్రం బాహుబలి. ఇండియన్ ప్రెస్టిజియస్ మూవీగా రూపొందిన ఈ చిత్ర నిర్మాణానికి మూడేళ్ల సమయం పట్టింది. దశాబ్ద కాలం తర్వాత ఈ హిట్ కాంబినేషన్ లో మూవీ అనగానే ఎలా ఉంటుందోనని అందరూ ఆసక్తిగా ఎదురుచూశారు.