ఆ రికార్డ్ సాధించే దిశగా బాహుబలి
Send us your feedback to audioarticles@vaarta.com
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా రాజమౌళి దర్శకత్వంలో రూపొందిన విజువల్ వండర్ బాహుబలి` అంచనాలను మించుతూ రికార్డ్ కలెక్షన్స్ సాధిస్తుంది. బెనిఫిట్ షో నుండి తిరుగులేని క్రేజ్ తో వసూళ్ల పరంగా సరికొత్త రికార్డులకు కేరాఫ్ అడ్రస్ అవుతుంది. తొలిరోజున ఓవర్ సీస్ లో వన్ మిలియన్ డాలర్స్ ను కలెక్ట్ చేసిన ఈ మూవీ అక్కడ న్యూ ట్రెండ్ సెట్ చేసింది. ప్రభాస్ ఫ్యాన్స్ ప్రభంజనం, ఇప్పటి వరకు ప్లాప్ సినిమా అంటే ఎరుగని దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో ఈ సినిమా రూపొందడంతో అభిమానులు, ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.
అందుకు తగినట్టుగానే రాజమౌళి సినిమాని విజువల్ ఫీస్ట్ గా మలిచాడు. తెలుగు, తమిళం, హిందీ, మలయాళంల్లో దాదాపు నాలుగు వేల స్క్రీన్స్ లో విడుదలై ఈ చిత్రం తెలుగులోనే తొలిరోజున 30 కోట్ల రూపాయలను కలెక్ట్ చేసింది. తమిళం, హిందీ, మలయాళంలతో కలుపుకుంటే ఈ సినిమా డొమెస్టిక్ లో 50 కోట్ల రూపాయలను, ఓవర్ సీస్ లో ఇప్పటి వరకు 16కోట్లు కలెక్ట్ చేసి మొత్తంగా 66 కోట్ల రూపాయలను వసూలు చేసిందని ట్రేడ్ వర్గాల అభిప్రాయం.
ఈ ప్రభంజనం ఇలాగే కొనసాగితే సౌతిండియాలో కొత్త రికార్డులను నెలకొల్పడమే కాకుండా తొలి మూడు రోజుల్లో వందకోట్ల రూపాయలను కలెక్ట్ చేస్తుందని ఈ వర్గాలు అభిప్రాయ పడుతున్నాయి. వందకోట్ల కలెక్షన్స్ సాధించే చిత్రంగా ఈ ఘనతను అందుకోనున్న తొలి తెలుగు సినిమా ఇదే కానుంది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com