'బాహుబలి 2' కి ముహుర్తం ఫిక్స్

  • IndiaGlitz, [Wednesday,November 11 2015]

ద‌ర్శ‌క‌ధీర రాజ‌మౌళి తెర‌కెక్కించిన సంచ‌ల‌న చిత్రం బాహుబ‌లి. ప్ర‌పంచ వ్యాప్తంగా వ‌చ్చిన స్పంద‌న‌తో బాహుబ‌లి 2 మూవీని అత్యంత ప్ర‌తిష్టాత్మ‌కంగా రూపొందించ‌డానికి రాజ‌మౌళి ప‌క్కా ప్ర‌ణాళిక రెడీ చేసాడు. డిసెంబ‌ర్ నుంచి బాహుబ‌లి 2 షూటింగ్ ప్రారంభిస్తార‌ని ప్ర‌చారం జ‌రిగింది. ఇక ఇప్పుడు ఎప్పుడు షూటింగ్ స్టార్ట్ చేస్తారో ముహుర్తం కూడా ఫిక్స్ చేసారు. వ‌చ్చే నెల 14 నుంచి షూటింగ్ ప్రారంభించ‌నున్నారు. జ‌న‌వ‌రి నుంచి భారీ షెడ్యూల్ ప్లాన్ చేస్తున్నారు. ఇప్పటికే బాహుబ‌లి 2 షూటింగ్ దాదాపు 40% షూటింగ్ పూర్తి అయ్యింది. మిగిలిన 60% షూటింగ్ ను 190 రోజుల్లో పూర్తి చేయాల‌ని రాజ‌మౌళి ప్ర‌ణాళిక‌ను సిద్దం చేసాడు. అన్ని అనుకున్న‌ట్టు జ‌రిగి బాహుబ‌లి 2 వ‌చ్చే సంవ‌త్స‌రంలోనే ప్రేక్ష‌కుల ముందుకు వ‌స్తుంద‌ని ఆశిద్దాం.