బాహుబలి నిర్మాతల ఫాంటసీ చిత్రం...
Send us your feedback to audioarticles@vaarta.com
బాహుబలి వంటి విజువల్ వండర్‌తో తెలుగు సినిమాను ప్రపంచ స్థాయికి తీసుకెళ్ళిన ఆర్కా మీడియా అధినేతలు, నిర్మాతలు ప్రసాద్ దేవినేని, శోభు యార్లగడ్డ. ఇప్పుడు వీరిద్దరూ కలిసి ఓ సోషియో ఫాంటసీ సినిమాను నిర్మించనున్నారు. ఈ ఫాంటసీ చిత్రం 40 కోట్ల బడ్జెట్‌తో రూపొందనుంది. సీనియర్ దర్శకుడు కె.రాఘవేంద్రరావు తనయుడు, అనగనగా ఒక ధీరుడు, సైజ్ జీరో చిత్రాల దర్శకుడు ప్రకాష్ కోవెలమూడి దర్శకత్వంలో ఈ సినిమా రూపొందనుంది. శర్వానంద్ ఇందులో హీరోగా నటించబోతున్నాడని సమాచారం. శర్వానంద్ మార్కెట్ ఇంకా పాతిక కోట్లే ఉన్న సమయంలో నిర్మాతలు అతనితో 40 కోట్ల సినిమాను చేయనుండటం ఆసక్తిని రేపుతుంది. సినిమా పెద్ద హిట్ అయితే శర్వానంద్ మార్కెట్ రేంజ్ పెరుగుతుందనడంలో సందేహం లేదు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments