బాహుబలి లాంటి చిత్రం జీవితంలో ఒక్కసారే: ప్రభాస్
Send us your feedback to audioarticles@vaarta.com
బాహుబలి`...టాలీవుడ్ ఇండస్ట్రీతోపాటు టోటల్ ఇండియా ఎప్పుడెప్పుడు విడుదలవుతుందా? అని ఆసక్తిగా ఎదురుచూస్తున్న సినిమా ఇది. ఓటమి ఎరుగని దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా అనుష్క, తమన్నా, రానా, సత్యరాజ్, నాజర్, రమ్యకృష్ణ వంటి భారీ తారాగణం, హై టెక్నికల్ వాల్యూస్‌తో ఈ చిత్రం రూపొందింది. దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు సమర్పణలో ఆర్కామీడియా వర్క్స్ బ్యానర్‌పై ప్రసాద్ దేవినేని శోభు యార్లగడ్డ నిర్మాతలుగా విజువల్ గ్రాండియర్‌గా రూపొందిన ఈ చిత్రం హై ఎక్స్‌పెక్టేషన్స్ మధ్య జూలై 10న వరల్డ్ వైడ్‌గా అత్యధిక థియేటర్స్‌లో విడుదలవుతుంది. ఈ సందర్భంగా యంగ్ రెబల్‌స్టార్ ప్రభాస్‌తో ఇంటర్వ్యూ....
ఫ్యాన్స్ కి చెబుతున్నాను సారీ
బాహుబలి` సినిమాని ముందు వన్ అండ్ హాఫ్ ఇయర్‌లోనే పూర్తి చేయాలనుకున్నాం. కానీ రెండున్నరేళ్ల సమయం పట్టింది. ఈ రెండున్నరేళ్లుగా ఫ్యాన్స్ నా సినిమా కోసం చాలా వెయిట్ చేశారు. వాళ్లు ఫీల్ అయ్యుంటారు కూడా. కానీ రేపు సినిమా చూస్తే ఇలాంటి సినిమా మేకింగ్ కోసం అంత సమయం తీసుకోవడం కరెక్టే అని అనుకుంటారు. తెలుగు సినిమాల్లో ప్రెస్టిజియస్ మూవీగా భావిస్తున్నాను.
ఒక ఎమోషనల్‌లో ఉన్నాను
ఇప్పటి వరకు చేసిన సినిమాలన్నీ ఒక ఎత్తు అయితే, బాహుబలి` మరో ఎత్తు. ఈ సినిమాకి ముందు చాలా రకాల టెన్షన్స్ ఫేస్ చేసినప్పటికీ బాహుబలి`సినిమాకి చాలా రకాల టెన్షన్స్ ఫేస్ చేశాను. రెండున్నరేళ్లు ఈ సినిమా కోసమే పనిచేయడం, భారీ బడ్జెట్ మూవీ, గ్రాండ్ రిలీజ్, ఎక్కువ భాషల్లో రిలీజ్ కావడం, ఒక రకమైన ఎమోషన్‌లో ఉన్నాను. ఎలా చెప్పాలో కూడా తెలియడం లేదు. నా మొదటి సినిమా కంటే ఎక్కువ టెన్షన్ ఫీలవుతున్నాను.
నా కెరీర్‌లో బిగ్ చాలెంజ్
రాజమౌళిగారు ఒక బిగ్ ప్రాజెక్ట్ చేస్తామని ఆరేళ్ల ముందు చెప్పారు. మూడేళ్ల ముందు ఇరవై నిమిషాల స్క్రిప్ట్ చెప్పారు. అప్పటి నుండి ఈ సినిమా రిలీజ్ ఎప్పుడా అనే ఒక ఎమోషన్‌లో ఉన్నాను. నా కెరీర్‌లో బిగ్ చాలెంజ్. ఈ సినిమా షూటింగ్‌కి వెళ్లడానికి ఆరు నెలల ముందు కత్తియుద్ధాలు, గుర్రపు స్వారీ, రాక్ క్లయింబింగ్ వంటివి ప్రాక్టీస్ చేశాను. క్యారెక్టర్ ఎలా చేయాలని వర్క్‌షాప్స్ కూడా చేశాం.
రిస్క్ అనిపించలేదు..ఇండియన్ అవతార్‌లా ఉందన్నారు
బాహుబలి` చేస్తున్నప్పుడు రిస్క్ అనిపించలేదు. ఎందుకంటే ఇలాంటి సినిమాలు వచ్చి చాలా కాలం అయింది. ఆడియెన్స్‌కి కొత్తగా ఏదీ ఉంటే అదే నచ్చుతుంది. అందుకే ఎక్కడా రిస్క్ అనిపించలేదు. హ్యాయస్ట్ బడ్జెట్ కారణంగానే ఎక్కువ భాషల్లో, అత్యధిక థియేటర్స్‌లో రిలీజ్ చేస్తున్నాం. కరణ్‌జోహార్ లాంటి దర్శకుడు ఈ సినిమా విజువల్స్ చూసి ఇండియన్ అవతార్‌లా ఉందని మెచ్చుకున్నారు.
బాహుబలి`కి ముందు నాలుగైదు లైన్స్ చెప్పారు
బాహుబలి`కి ముందు కృష్ణదేవరాయలపై ఒక స్టోరీ, అల్లూరిసీతారామరాజుపై ఒక స్టోరి, ఒక రాజుకి సంబంధించిన కథ చెప్పి నాలుగైదు లైన్స్ చేశారు కానీ ఆయనకి ఎందుకనో శాటిస్పాక్షన్ కలగలేదు. అప్పుడు బాహుబలి` కథ చెప్పారు. అది అందరికీ బాగా నచ్చింది.
బాహుబలి` పార్ట్ 2 ప్లానింగ్‌ను బట్టే నెక్స్ ట్ మూవీ
సెప్టెంబర్ 15 నుండి బాహుబలి సెకండ్ పార్ట్‌ను స్టార్ట్ చేస్తాం. మధ్యలో గ్యాప్ ఉన్నప్పటికీ వర్కవుట్స్ చేసుకోవాలి. దీనికి ఒక ప్లానింగ్ ప్రకారమే వెళ్లాలి. సెకండ్ పార్ట్ ప్లానింగ్‌ను బట్టే నా నెక్స్‌ట్ మూవీ కూడా డిపెండ్ అవుతుంది. మధ్యలో ఎక్కువ గ్యాప్ అనిపిస్తే ఇంకో మూవీ చేయడమో ఏదో చేస్తాను.
అందుకే రెండు పార్ట్స్ గా చేశాం
ముందు ఒక పార్ట్‌గానే సినిమాని చేద్దామనుకున్నాం. అయితే సినిమాని షార్ట్ చేయడం వల్ల ఎమోషన్స్ మిస్సవుతున్నాయనిపించింది. అందుకనే సెకండ్ పార్ట్ చేయాలని డిసైడ్ చేయాలనుకున్నాం.
మేం ఉహించిన దానికంటే వందరెట్లైంది
రాజమౌళిగారితో నాకు మంచి పరిచయం ఉంది. గ్యాప్ ఉన్నప్పుడంతా ఇద్దరం కలిసి కూర్చొని మాట్లాడుకుంటుంటాం. ఒక బిగ్ ప్రాజెక్ట్ చేద్దామని అనుకున్నాం కానీ తొలి షెడ్యూల్ పూర్తయిన తర్వాత వచ్చిన రెస్పాన్స్‌కి మేం ఉహించిన దానికంటే వందరెట్లు ఉందని అర్థమైంది. ఇండియా వైడ్‌గానే కాకుండా హాలీవుడ్‌లో కూడా కొన్ని చోట్ల బాహుబలి` గురించి గొప్పగా రాశారు.
వన్స్ ఇన్ ఎ లైఫ్ టైమ్ మూవీ
వన్స్ ఇన్ లైఫ్ టైమ్ మూవీ. కథ చెప్పి, విజన్ చెప్పి ఏ లాంగ్వేజస్‌లో విడుదల చేస్తామో కూడా చెప్పారు. ఇండియన్ బిగ్గెస్ట్ మోషన్ పిక్చర్ తెలుగులో రూపొందుతుంది. దాని కోసం చాలా మంది చాలా రకాలుగా కష్టపడ్డారు. దాదాపు నలభై, యాభై సంవత్సరాలుగా ఇలాంటి సినిమా రాలేదు. ఇండియన్ సినిమాలో ప్రెస్టిజియస్ మూవీగా రూపొందిన ఈ చిత్రంలో నేను హీరో అని చెప్పినప్పుడు ఒక హీరోగా నేను సమయం కేటాయించడం చేస్తే చాలు. మిగతావన్నీ రాజమౌళిగారే చూసుకుంటారు. ఈ కేటాయించిన టైమ్‌లో పర్సనల్ టైమ్ కూడా ఉంటుంది. నేనే కాదు, రాజమౌళిగారు ఆయన ఫ్యామిలీ, సెంథిల్, సాబుశిరిల్ ఇలా చాలా మంది వాళ్ల ఫ్యామిలీస్ వదులుకుని సినిమా చేశారు. ఈ సినిమాకి పనిచేసినవారు, లోకేషన్‌కి వచ్చిన వారు చాలా ఎగ్జైట్ అయ్యారు.
ఇంపాక్ట్ ఉంటుంది..మంచి స్క్రిప్ట్స్ ఉండేలా ప్లాన్ చేసుకోవాలి
ప్రతి ఒక నటుడికి బాహుబలి` వంటి సినిమా మళ్లీ రాదు. ఇప్పుడు అవకాశం రావడమే అదృష్టం. బాహుబలి` ఇంపాక్ట్ ఉంటుంది. ఆ ఇంపాక్ట్‌ను కానీ నెక్స్‌ట్ సినిమాలను ఎంచుకునేటప్పుడు మంచి స్క్రిప్ట్స్‌ను ఎంచుకోవాలి.
చాలెంజింగ్ యాక్షన్ పార్ట్
సినిమాలో యాక్షన్ పార్ట్ చాలెంజింగ్‌గా అనిపించింది. 380 రోజులు షూటింగ్ చేస్తే అందులో నేను 300 రోజులు వర్క్ చేశాను. అందులో 250 రోజుల యాక్షన్‌పార్ట్ ఉంటుంది. ఈ సినిమాలో షూటింగ్ టైమ్‌లో షోలర్డ్ ఆపరేషన్ జరిగింది. అయితే భుజం నొప్పి అంతకు ముందే ఉన్నప్పటికీ ఈ సినిమాలో ఎక్కువ ఎక్సర్‌సైజస్ చేయడం, వెయిట్స్ ఎత్తడం వంటి పనులు వల్ల నొప్పి ఎక్కువైంది.
ఆ టెన్షన్స్ తప్పలేదు
సినిమా షూటింగ్ టైమ్‌లో చాలా రూమర్స్ వినిపించాయి. కేరళలోని వాటర్‌ఫాల్స్ దగ్గర నడిచేటప్పుడు జారిపడి చేయి గీసుకుంది. అంతే షూటింగ్‌లో ప్రభాస్ పడిపోయాడని, తలకు దెబ్బ తగిలిందని, కోమాలోకి వెళ్లిపోయానని చాలా వార్తలు వినపడ్డాయి దాంతో పెద్దనాన్నకి రోజుకి చాలా కాల్స్ రావడంతో ఆయన నాకు గంటకొకసారి ఫోన్ చేసేవారు. ఆరేడు నెలలు మాకు ఈ ఫోన్ కాల్స్ టెన్షన్ తప్పలేదు.
అవన్నీ రూమర్స్
ఏదో ఒకరోజు పెళ్లి తప్పకుంటా చేసుకుంటాను. అదెప్పుడనేది కచ్చితంగా ఇప్పుడే చెప్పలేను. నా పెళ్లి గురించి వస్తున్నవన్నీ రూమర్స్
ఒక సినిమాతో చెప్పలేం
ఒక సినిమా సక్సెస్, కలెక్షన్స్ తో నెంబర్‌వన్ పోజిషన్ చేరుకుంటామని చెప్పలేం. అది పది, పదిహేనేళ్ల ప్రాసెస్.
మంచి ఆఫర్ వస్తే తప్పకుండా చేస్తాను
బాలీవుడ్‌లో చేయాలని చేయను. మంచి ఆఫర్ వస్తే తప్పకుండా చేస్తాను. అయితే ద్విభాషా చిత్రంగా తెలుగు, తమిళంలో తప్పకుండా చేయాలనుకుంటున్నాను. యాక్షన్ జాక్సన్ సినిమా టైమ్‌లో ప్రభుదేవాగారితో ఉన్న ఫ్రెండ్‌ఫిప్ కారణంగా అలా మెరిశాను. శివ` సినిమాతో తెలుగు ఇండస్ట్రీ అంటే ఎంటో తెలిసింది. ఇప్పుడు బాహుబలి`తో మళ్లీ తెలుగు సినిమా గురించి తెలుసుకుంటున్నాం అని ముంబైలో చాలా మంది సినిమాని అప్రిసియేట్ చేశారు.
ఫైట్ మాస్టర్ కాదు.. యాక్షన్ ఇంజనీర్
పీటర్ హెయిన్స్ ఫైట్ మాస్టర్ కాదు.. యాక్షన్ ఇంజనీర్. ఏదీ చేసిన ఒక ప్లానింగ్ ఉంటుంది. ఆయనతో చాలా వరకు సినిమాలు చేశాను. ఈ సినిమాలో ఆయన పూర్తిగా ఇన్‌వాల్వ్ చేశాను. వార్ సీక్వెన్స్‌లో రోప్స్‌తో ముప్పై, నలభై మంది ఫైటర్స్ ఎగురుతుండేలా ఒక సాలిగూడులో రోప్స్‌తోనే ప్లాన్ చేశారు. అలాగే ఎనిమిదిన్నర టన్నుల బరువున్న విగ్రహం నిలబెట్టే సీన్ కోసం నాలుగు ఇండస్ట్రియల్ క్రేన్స్‌ను ఉపయోగించారు. ఇలాంటి చాలా విషయాల్లో పీటర్ హెయిన్స్ స్పెషల్ కేర్ తీసుకుని చేశారు. వియత్నాం నుండి సన్, తన్, లక్ ముగ్గురు వచ్చారు. ప్రతిరోజు నాలుగు నుండి ఐదుగంటలు కత్తియుద్ధాలు సహా యాక్షన్ పార్ట్స్‌కి సంబంధించి ట్రయినింగ్ ఇచ్చేవాళ్లు.
ఆయన గురువుతో సమానం....
బాహుబలి తర్వాత నెక్స్‌ట్ సినిమాని రాజమౌళిగారు ఎలా చేస్తారోనని ఉహించలేం. ఒక సినిమా తర్వాత ఆయన చేసే నెక్స్‌ట్ సినిమాకి విజన్ మారిపోతుంది. తప్పకుండా ఆయన హాలీవుడ్‌కి వెళ్లిపోతారు. ఆయన ఆలోచననా విధామనే డిఫరెంట్‌గా ఉంటుంది. ఆయనతో వ్యక్తిగతంగా కూడా చాలా మంచి రిలేషన్ ఉంది. ఆయన దగ్గరకి రాత్రి పదకొండు గంటలకు వెళితే పొద్దున ఐదు గంటల వరకు మాట్లాడుతూనే ఉంటారు. ప్రతి సినిమా గురించి మాట్లాడుతారు. చాలా విషయాల్లో సలహాలిస్తుంటారు. ఒక గురువులాంటి వ్యక్తి. పర్సనల్‌గా కూడా నాకు చాలా ముఖ్యమైన వ్యక్తి.
ఎక్స్ ట్రార్డినరీ మ్యూజిక్ అండ్ బ్యాగ్రౌండ్ స్కోర్...
ఈ నిమాలో సాంగ్స్ అంటే రెండే ఉంటాయి. పచ్చబొట్టేసిన..., మనోహరి.. మినహా మిగతా బిట్ సాంగ్స్ ఉంటాయి. విజువల్‌గా చూసినప్పుడు అందరం స్టన్ అయిపోయాం. విజువల్‌కి కీరవాణిగారు ఇచ్చిన మ్యూజిక్, బ్యాగ్రౌండ్‌స్కోర్ ఎక్స్‌ట్రార్డినరీగా ఉంది.
అలాంటి నిర్మాతలను చూడలేనెమో...
ఇదొక విజన్ డిజైన్డ్ మూవీ. ఇలాంటి సినిమాని సెట్స్‌లోకి తీసుకెళ్లాలంటే గట్స్ ఉంటేనే సాధ్యమవుతుంది. అలాగే చాలా ఓపిక ఉండాలి. నిర్మాతలు ప్రసాద్ దేవినేని, శోభు యార్లగడ్డగారికి ఆ విషయంలో హ్యాట్సాప్ చెప్పాల్సిందే. సినిమా గ్రాండియర్‌గా రావడానికి వారు యూనిట్‌కి కావాల్సినంత స్వేచ్ఛనిచ్చారు. ఇప్పుడు సినిమాని గ్రాండ్ లెవల్‌లో ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తున్నారు. అలాంటి నిర్మాతలను ఇప్పటి వరకు నేను చూడలేదు, చూడనని కూడా అనుకుంటున్నాను.
హీరోయిన్స్ గురించి...
అనుష్కతో బాహుబలి` నేను చేసిన మూడో సినిమా. తను చాలా కంఫర్టబుల్ హీరోయిన్. అలాగే తమన్నా చాలా హార్డ్ వర్కర్ అండ్ ప్రొఫెషనల్.
నెక్స్ ట్ ప్రాజెక్ట్స్...
ఈ సినిమా తర్వాత సుజిత్ దర్శకత్వంలో ఓ మూవీ చేయాల్సి ఉంది. అలాగే గోపికృష్ణా మూవీస్ బ్యానర్‌లో ఓ సినిమా ప్లాన్ చేస్తున్నాం.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com