రైట్ రైట్ సినిమాతో నాలో ఆ నమ్మకం కలిగింది - బాహుబలి ప్రభాకర్
Send us your feedback to audioarticles@vaarta.com
సుమంత్ అశ్విన్, పూజా జవేరి, కాళికేయ ప్రభాకర్ ప్రధాన పాత్రల్లో మను తెరకెక్కించిన చిత్రం రైట్ రైట్. ఈ చిత్రాన్నివంశీకృష్ణ రెడ్డి నిర్మించారు.
మలయాళంలో ఘన విజయం సాధించిన చిత్రాన్ని రైట్ రైట్ టైటిల్ తో రీమేక్ చేసారు. వైవిధ్యమైన కథాంశంతో రూపొందిన రైట్ రైట్ చిత్రాన్ని ఈ నెల 10న రిలీజ్ చేస్తున్నారు. ఈ సందర్భంగా కాళికేయ ప్రభాకర్ తో ఇంటర్ వ్యూ మీకోసం...
కాళికేయ ప్రభాకర్ నుంచి రైట్ రైట్ ప్రభాకర్ వరకు జర్ని ఎలా ఉంది..?
బాహుబలి చిత్రంలో కాళికేయ పాత్రకు ఊహించని రెస్పాన్స్ వచ్చింది. అసలు..నేను సినిమాల్లోకి రావడమే అనుకోకుండా జరిగింది. మర్యాద రామన్న చిత్రంలో రాజమౌళి గారు నాకు ఏక్టింగ్ రాదని చెప్పినా నేను నీతో చేయిస్తానని చెప్పి అవకాశం ఇచ్చారు. ఇక బాహబలి అయితే నాకు తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా జాతీయ స్ధాయిలో గుర్తింపు తీసుకువచ్చింది. ఇటీవల గోవా లో జరిగిన ఫిల్మ్ ఫెస్టివల్ కి వెళ్లినప్పుడు వివిధ దేశాల నుంచి వచ్చిన ప్రతినిధులు నన్ను గుర్తించడం.. నా నటన గురించి.. మాట్లాడుతుంటుంటే ఫస్ట్ టైమ్ నా కళ్లంట నీళ్లు వచ్చాయి. ఈ జర్నీలో ఇంతకు మించి కావాల్సింది ఏముంటుంది.
రైట్ రైట్ లో మీ పాత్ర ఎలా ఉంటుంది..?
ఈ చిత్రంలో మంచి డ్రైవర్ రోల్ పోషించాను. ఇప్పటి వరకు నెగిటివ్ రోల్స్ చేసాను. ఇందులో పాజిటివ్ క్యారెక్టర్ చేయడం ఆనందంగా ఉంది. నా పాత్రలో కామెడీతో పాటు సెంటిమెంట్ కూడా ఉంటుంది. క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఫ్రూవ్ చేసుకునేందుకు ఈ సినిమా ఒక మంచి అవకాశం కల్పించింది.
ఇంతకీ...రైట్ రైట్ కథ ఏమిటి..?
సిటీ నుంచి విలేజ్ కి, విలేజ్ నుంచి సిటీకి వెళ్లే బస్సు జర్నీయే రైట్ రైట్ అని చెప్పవచ్చు. ఈ జర్నీలో ఒక అందమైన ప్రేమ కథ. ఆ ప్రేమ కథలో వచ్చే మలుపులు ఆసక్తిగా ఉంటాయి.
హీరో సుమంత్ అశ్విన్ తో ఫస్ట్ టైమ్ వర్క్ చేసారు కదా..వర్కింగ్ ఎక్స్ పీరియన్స్ ఎలా ఉంది..?
ఈ సినిమాకి ముందు సుమంత్ అశ్విన్ ని కలవలేదు. ఈ సినిమా షూటింగ్ లోనే కలిసాను. తక్కువ టైమ్ లోనే మంచి ఫ్రెండ్స్ అయిపోయాం. ఇప్పుడు సుమంత్ నాకు హీరోగా కన్నా మంచి ఫ్రెండ్ అయ్యాడు. జనరల్ గా హీరో, హీరోయిన్ మధ్య కెమిస్ట్రీ కుదరింది అంటారు కదా...ఈ సినిమా చూసిన తర్వాత మా ఇద్దరి మధ్య కెమిస్ట్రీ బాగా కుదిరింది అంటారు.
ఇప్పటి వరకు విలన్ గా నటించిన మీరు ఫస్ట్ టైమ్ కమెడియన్ గా నటించారు కదా..? రెండింటిలో ఏది కష్టంగా అనిపించింది..?
కామెడీ చేయడం కష్టం. అలాంటిది ఇలాంటి పాత్రలు వచ్చినప్పుడు..ఆ పాత్రకు మనం న్యాయం చేసామనిపిస్తే చాలా తృప్తిగా ఉంటుంది.
ఇంతకీ..రైట్ రైట్ ఎలాంటి ఫీలింగ్ కలిగించింది..?
ఇంతకు ముందు చెప్పినట్టుగా..అనుకోకుండా నటుడు అయ్యాను. మర్యాద రామన్న, బాహబలి...ఇలా దాదాపు 50 సినిమాలకు పైగా నటించాను. అయితే...ఇప్పటి వరకు నేను ఆర్టిస్ట్ ని అనే నమ్మకం కలగలేదు. ఈ సినిమాతో నేను ఒక ఆర్టిస్ట్ ని అనే నమ్మకం కలిగింది.
నెక్ట్స్ ప్రాజెక్ట్స్ గురించి..?
గోపీచంద్ ఆక్సిజన్ లో టిపికల్ విలన్ రోల్ చేస్తున్నాను. ఆవు పులి మధ్యలో ప్రభాస్ పెళ్లి, కాళికేయ వెర్షెస్ కాట్రవల్లి, అలాగే మోహన్ లాల్ నటిస్తున్న మలయాళ మూవీ చేస్తున్నాను.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments