బాహుబ‌లి జాతీయ అవార్డ్ గురించి నిర్మాత శోభు ఏమ‌న్నారంటే...

  • IndiaGlitz, [Monday,March 28 2016]

యంగ్ రెబ‌ల్ స్టార్ ప్ర‌భాస్ - అందాలతార అనుష్క - రానా కాంబినేష‌న్లో ద‌ర్శ‌క‌ధీర రాజ‌మౌళి తెర‌కెక్కించిన సంచ‌ల‌న చిత్రం బాహుబ‌లి. ఒక ప్రాంతీయ చిత్రం ప్ర‌పంచ వ్యాప్తంగా ఇంత‌టి సెన్సేష‌న్ క్రియేట్ చేయ‌డం విశేషం. బాహుబ‌లి సినిమాకి కేంద్ర‌ప్ర‌భుత్వం ఉత్త‌మ జాతీయ చిత్రం అవార్డ్ ప్ర‌క‌టించ‌డం తెలుగువారంద‌రికీ గ‌ర్వ‌కార‌ణం.

ఈ సంద‌ర్భంగా బాహుబ‌లి నిర్మాత శోభు యార్ల‌గ‌డ్డ మాట్లాడుతూ...తెలుగు సినిమాకి జాతీయ అవార్డ్ రావ‌డం అంటే.... శంక‌రాభ‌ర‌ణం, గీతాంజ‌లి చిత్రాల‌కు వ‌చ్చాయి. ఇప్పుడు బాహుబ‌లి సినిమాకి జాతీయ అవార్డ్ రావ‌డం హ్యాఫీగా ఉంది. 2012 నుంచి ప్రాజెక్ట్ స్టార్ట్ చేసాం. ప్ర‌తి ఒక్క‌రు చాలా క‌ష్ట‌ప‌డ్డారు. దానికి ఫ‌లితం ద‌క్కిన‌ట్టు అయ్యింది. హార్డ్ వ‌ర్క్ తో గుడ్ ఫిల్మ్ చేస్తే క‌చ్చితంగా జాతీయ అవార్డ్ వ‌స్తుంది అని బాహుబ‌లి నిరూపించింది. ఇక‌ బాహుబ‌లి 2 గురించి చెప్పాలంటే...బాహుబ‌లి కంటే బెట‌ర్ గా ఉండేలా బాహుబ‌లి 2ని రూపొందిస్తున్నాం. నెక్ట్స్ ఇయ‌ర్ స‌మ్మ‌ర్ లో బాహుబ‌లి 2 చిత్రాన్ని రిలీజ్ చేయ‌డానికి ప్లాన్ చేస్తున్నాం అన్నారు.

More News

సునీల్ హీరోగా క్రాంతి మాధ‌వ్ ద‌ర్శ‌క్వంలో సినిమా ప్రారంభం

ప్ర‌ముఖ నిర్మాత దిల్ రాజు కెమెరా స్విచ్చాన్ చేశారు. సురేష్ బాబు తొలి స‌న్నివేశానికి క్లాప్ కొట్ట‌గా క్రాంతి మాద‌వ్ గౌరవ ద‌ర్శ‌క‌త్వంలో సునీల్‌, మియా హీరో హీరోయిన్లుగా యునైటెడ్ కిరిటీ మూవీస్ లిమిటెడ్ ప‌తాకంపై నూత‌న చిత్రం సోమ‌వారం హైద‌రాబాద్ దైవ‌స‌న్నిధానంలో ప్రారంభ‌మైంది. క్రాంతిమాధ‌వ్ ద‌ర్శ‌కుడు. ప‌రుచూరి కిరిటీ ఈ చిత్

శ్రియ ఉంటే హిట్టే..

కథానాయికగా 15ఏళ్ల ప్రయాణం ఆమెది.అయినా ఇప్పటికీ అదే ఫిట్ నెస్.అదే గ్లామర్.

63వ జాతీయ అవార్డులు ప్ర‌క‌ట‌న‌..ఉత్త‌మ చిత్రం బాహుబ‌లి

కేంద్ర‌ప్ర‌భుత్వం అందించే ప్ర‌తిష్టాత్మ‌క 63వ జాతీయ అవార్డులును  ప్ర‌క‌టించింది. ద‌ర్శ‌క‌థీర రాజ‌మౌళి తెర‌కెక్కించిగా ప్ర‌పంచ వ్యాప్తంగా సెన్సేష‌న్ క్రియేట్ చేసి దాదాపు 600 కోట్లు వ‌సూలు చేసిన బాహుబ‌లి చిత్రం ఉత్త‌మ చిత్రంగా జాతీయ అవార్డును సొంతం చేసుకోవ‌డం విశేషం.

ఊపిరి రెండు రోజుల షేర్ వివరాలు

నాగార్జున-కార్తీ-తమన్నాకలసి నటించిన భారీమల్టీస్టారర్ ఊపిరి.

ఊపిరి ఈరేంజ్ సక్సెస్ కి కారణం అదే - అక్కినేని నాగార్జున

నాగార్జున-కార్తీ-తమన్నాకలసి నటించిన భారీ మల్టీస్టారర్ ఊపిరి.వంశీ పైడిపల్లి దర్శకత్వంలో పి.వి.పి నిర్మించిన ఊపిరి చిత్రం ప్రపంచ వ్యాప్తంగా విజయవంతంగా ప్రదర్శింపబడుతోంది.