బలి..బలి..బలిరా బలి సాహురా బాహుబలి మోషన్ పోస్టర్ రిలీజ్..!
Saturday, October 22, 2016 తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com
Send us your feedback to audioarticles@vaarta.com
దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న సంచలన చిత్రం బాహుబలి 2. ప్రభాస్, రానా, అనుష్క, తమన్నా,రమ్యకృష్ణ ప్రధాన పాత్రల్లో రూపొందుతున్న బాహుబలి 2 డిసెంబర్ కి మొత్తం షూటింగ్ పూర్తి చేసుకోనుంది. యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ పుట్టినరోజు కానుకగా ఈరోజు ముంబాయిలో బాహుబలి 2 ఫస్ట్ లుక్ రిలీజ్ చేసారు.
ఈ కార్యక్రమంలో ప్రభాస్, రాజమౌళి, అనుష్క, తమన్నా, నిర్మాత శోభు యార్లగడ్డ తదితరులు పాల్గొన్నారు. బలి..బలి..బలిరా బలి సాహురా బాహుబలి అనే వాయిస్ రూపొందించిన బాహుబలి 2 మోషన్ పోస్టర్ రిలీజ్ చేసారు. ఓ చేతిలో గొలుసు మరో చేతిలో కత్తి దీనికి తోడు సిక్స్ ప్యాక్ తో ఉన్నప్రభాస్ విశేషంగా ఆకట్టుకుంటుంది. ఇక ప్రభాస్ ఫ్యాన్స్ కి అయితే పండగే. ఈ సంచలన చిత్రాన్ని ప్రపంచ వ్యాప్తంగా ఏప్రిల్ 28న రిలీజ్ చేయనున్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Contact at support@indiaglitz.com
Comments