'బాహుబలి' ఓ ఎక్స్ పెరిమెంట్ ..ఓ ఎక్స్ పీరియెన్స్ - ప్రభాస్
Monday, April 17, 2017 తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com
Send us your feedback to audioarticles@vaarta.com
ఆర్కా మీడియా వర్క్ బ్యానర్‌పై ప్రభాస్, అనుష్క, రానా, తమన్నా ప్రధాన పాత్రధారులుగా ఎస్.ఎస్.రాజమౌళి దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రం `బాహుబలి 2`. ఈ సినిమా ఏప్రిల్ 28న విడుదల కానుంది. ఈ సందర్భంగా యంగ్ రెబల్ స్టార్ప్రభాస్ మీడియాతో సినిమా మాట్లాడారు...
అప్పడే రిలాక్స్ అవుతాను...అంత ఈజీ కాదు...
ఇంకా బాహుబలి నుంచి బయటికి రాలేదు. నాలుగేళ్లు దాన్లోనే ఉన్నాం కదా.. సినిమా రిలీజ్ అయ్యాక రిలాక్స్ అవుతాను.బాహుబలి నుండి బయటకు రావడం అంత ఈజీ అయితే కాదండీ.
ప్రతి పాత్ర కీలకమే..
బాహుబలి పార్ట్ 1 రిలీజైన తర్వాత మేమంతా రిలీఫ్‌గా కూర్చుని ఉండగా ఒకరోజు వినాయక్‌గారు అడిగారు.. శివగామి ఎందుకు చనిపోయింది? కట్టప్ప ఎందుకు పొడిచాడు? అసలేమైంది? ఇలాంటివి పది ప్రశ్నలు ఉండి కూడా సినిమా హిట్ అయిందంటే మామూలు విషయం కాదు. అన్నీ ప్రశ్నలతో సినిమా బ్లాక్ బస్టర్ అనేది ఎలా వచ్చిందనేది వినాయక్‌గారు మమ్మల్ని అడిగిన ప్రశ్న. అప్పటి వరకు అసలు ఆ సినిమాలో అన్ని ప్రశ్నలున్నట్టు నాకు అప్పటిదాకా అనిపించలేదు. ఎందుకంటే నేను పూర్తి స్టోరీ విన్నాను. పూర్తిగా తెలుసు కాబట్టి. ఇందులో ప్రతి ఒక్కరి పాత్రా కీలకమైనదే. ఇన్ని పాత్రల్ని ఒక్క కథలో చెప్పడం కష్టమనే రెండు భాగాల్లో తీద్దామని డిసైడ్ అయ్యారు. ఈ పార్ట్ ఒన్, పార్ట్ టూ ఎక్కడ కట్ చేయాలనే పాయింట్‌ను ఆలోచించడానికే ఆయన 15-20 రోజులు టైమ్ తీసుకున్నట్టున్నారు.
శివడు పాత్ర ఈజీ...
బాహుబలిలో శివుడు చాలా ఈజీ. బావుంటుంది. సీన్లు బావుంటాయి. అరవచ్చు, కోప్పడొచ్చు.. కానీ బాహుబలి అనేది డిజైన్డ్ పాత్ర. కింగ్ అవుతాడా? కాదా? అయితే ఎలా ఉంటుంది? వంటివన్నీ అతని పాత్రలో మెయిన్. అందుకే ఆ డిజైన్డ్ పాత్ర కష్టమనిపించింది. శివుడు కొండల్లో పెరిగినవాడికిమైండ్ సెట్ డిఫరెంట్.. వాడికి వాడి గురించి అసలు తెలియదు. తెలియకుండానే డీఎన్ఏని బట్టి ఎదిగాడు. బాహుబలికి ప్రతిదీ మైండ్‌లో ఉంటుంది. రెస్పాన్సిబిలిటీ ఉంది.
నాకు ఇదే నచ్చింది..
రాజమౌళిగారు ఐదేళ్ల ముందు ఓ లైన్ చెప్పారు. దానికి ముందు ఐదేళ్ల ముందు నుంచీ ఐదారుకథలు చెప్పారు. అన్నిట్లోకీ నాకు నచ్చింది ఇదే. అందులో ఓ సారి కృష్ణదేవరాయల కథ కూడా చెప్పారు. బిఫోర్ బికమింగ్ ద కింగ్ అనేది కూడా ఉంటుంది. అయినా వాటన్నిటికన్నా నాకు నచ్చింది ఇదే. రెబల్ డబ్బింగ్లో ఉన్నప్పుడు నాకు ఈ లైన్ చెప్పారు. లైన్ ఇంపాక్ట్ నుంచి బయటపడటానికి నాకు ఐదారు రోజులు పట్టింది. ఆ ఇంపాక్ట్స్ అన్నీ సెకండాఫ్‌లో ఉంటాయి. కథ చాలా తొందరగా చేసుకున్నారు. ప్రీ ప్రొడక్షన్ మాత్రం టైమ్ తీసుకున్నారు.
ప్రతిదీ ఎక్స్పీరియెన్సే..
ఫస్ట్ పార్ట్ లో ప్రతి షాటూ నాకు ఎక్స్ పీరియన్సే. ప్రతిదీ ఊహించే చేయాలి. హాఫ్ బ్లైండ్‌లోనే ఫస్ట్ పార్ట్ రిలీజైంది. ఇంత డబ్బు ఖర్చుపెట్టి, అన్ ఫినిష్డ్ సినిమా చేసి ఎప్పుడూ మనం రిలీజ్ చేయలేదు. ఇన్ని ప్రశ్నలతో మన సినిమా ఎప్పుడూ విడుదల కాలేదు.. అలాంటి అన్ని యాంగిల్స్ లోనూ బాహుబలి తొలి సినిమా అయింది. రిలీజ్ అయిన తర్వాత చాలా పెద్ద హిట్ అయింది. నిర్మాతలు కూడా రిస్క్ తీసుకుందామని రెడీ అయ్యారు.
నా లైఫ్‌లో ఇది చాలనిపించింది...
వాటర్ ఫాల్స్ సీక్వెన్స్, వార్, విజువల్స్ మనం ఎప్పుడూ వినలేదు. వాటర్ పాల్స్ ఆకాశం నుంచి వచ్చినట్టు రాజమౌళిగారు ఆలోచించారు. దేవర సాంగ్‌ను చూసి అవతార్‌లా ఉందే అని కరణ్‌జోహార్ అన్నారు. వాటర్ ఫాల్ ను నేను హాలీవుడ్లో కూడా చూడలేదు నేను. అంత గొప్పగా ఉంది. అది చూశాక నా లైఫ్‌లో ఇది చాలనిపించింది.
ఫస్ట్ పార్ట్ చూశాక ధైర్యం వచ్చిందా?
ఫస్ట్ పార్ట్ కోసం ఎంత కష్టం పడ్డామంటే..నేను, రాజమౌళిగారు ఇంకో మూడు సినిమాలు చేస్తే సరిపోద్దేమో.. కానీ నిర్మాతలు అంత డబ్బులు పెట్టి ఆ సినిమా ఆడకపోతే ఆ వడ్డీలు, వాటినుంచి బయటపడటం చాలా కష్టమయ్యేది. బాహుబలి హిట్ అయితే మా దృష్టిలో ఫ్లాప్ కిందే లెక్క. మహా బ్లాక్ బస్టర్ అయినా నిర్మాతకు ఇప్పటికీ ఏం మిగల్లేదంటే చూడండి.సినిమాను మల్టీ లాంగ్వేజస్‌లో విడుదల చేయాలని ముందుగానే అనుకున్నాం. ఎందుకంటే రాజమౌళిగారు ఆ సినిమా డ్రామా, లైన్లోనే అన్నీ లాంగ్వేజస్‌కి కనెక్ట్ అయ్యేలా చేశారు. లైన్లో ఆ డెప్త్ ఉంది. ఆ విజువల్, ఆ వార్.. ఇవన్నీ ఇండియన్ సినిమాలో ఇంతకు ముందు కనిపించలేదు. డ్రామా విత్ వార్ అనేది, పీరియాడిక్ ఫిల్మ్ విత్ బెస్ట్ ఎపిసోడ్‌తో మనం ఇప్పటిదాకా ఎప్పుడూ చూడలేదు. ఇంటర్నేషనల్ లెవల్లో ఉంది
ఇదొక ఎక్స్పెరిమెంట్...
నేను, రాజమౌళిగారు వేరే సినిమాలు చేసి ఉంటే ఎనిమిదేళ్లు పట్టేది. అలా కాకుండా చేశాం కాబట్టే ఇప్పటికి పూర్తయింది. నేను కూడా వేరే సినిమాలు చేసి ఉండవచ్చు. కానీ నాకు అది నచ్చలేదు. పూర్తిగా ఈ సినిమా మీదే ఉండాలని నిర్ణయించుకున్నాం. వార్ని మేం 80 రోజులు ప్లాన్ చేశాం. ఎందుకంటే ప్లాన్ చేయడానికి రిఫరెన్స్ కూడా ఏమీ లేదు. దాన్లో దిగడం ప్లాన్ చేయడం, చేసుకుంటూ వెళ్లాం. 80 అనుకున్నది 120కి చేరుకుంది. మధ్యలో సర్జరీ అయి, మధ్యలో నాలుగు నెలలు ఆపి ఇలా చేసుకుంటూ వెళ్లాం. సో సినిమా ఇదొక ఎక్స్ పెరిమెంట్. ఎక్స్ పీరియన్స్ అంతే. మధ్యలో వెళ్లొచ్చి సినిమా చేయడమనేది చాలా కష్టం.
బాహుబలి సెట్స్ నుంచి వస్తున్నప్పుడు ఏమనిపించింది?
ఎమోషన్‌గా అనిపించింది...
ఫస్ట పార్ట్ అయినప్పుడు మాత్రం కాస్త ఎమోషన్‌గా అనిపించింది. ఇలాంటి గొప్ప సినిమా ఆడుతుందా? ఆడితే ఇంకో పార్ట్ ఉంటుంది.. లేకపోతే? అని అక్కడున్న వారిని హగ్ చేసుకుని వచ్చాను. కానీ ఇప్పుడు నేను ఇంకా ఆ సినిమా నుంచి బయటికి రాలేదు.
అలర్ట్‌గా ఉండేవాళ్ళం..
ఒక సీన్ 30 లక్షలంట, 40 లక్షలంట.. ఒన్ మోర్ అంటే ఎలాగ? అనే మెంటల్ టెన్షన్‌తో ఉన్నాను. వార్‌లో ఒక షాట్ ఉంటే మాసివ్... ఉండేది. ఎక్కడో ఏదో మిస్ అయితే ఒన్ మోర్ అంటే దాన్ని సెట్ చేయడానికి 3,4 గంటలు అయ్యేది. అందువల్ల స్కూల్‌కి వెళ్లినట్టు చేశా. నేను స్కూల్‌ని ఎంజాయ్ చేయలేదు కానీ బాహుబలిని ఎంజాయ్ చేశా. మామూలుగా మిర్చిలాంటి సినిమాలైతే ఫ్రెండ్సే కాబట్టి రేయ్ నేను 11కొస్తా, 12కొస్తా అని చెప్పుకోవచ్చు. ఈ సినిమాకు కూడా రాజమౌళికి చెప్పగలిగే చనువున్నా.. అంత ఖర్చుపెడుతున్న తీరు చూసి మనకే ఒక టెన్షన్ ఉంటుంది. దానివల్ల మోర్ అలర్ట్ గా ఉండేవాళ్లం.
ఆడియెన్స్‌కు ఆలోచిస్తారు..
ఆడియెన్స్‌ను బాగా ఆలోచిస్తున్నారు. ఎందుకంటే ఛత్రపతి సినిమా తర్వాత డార్లింగ్ సినిమా చేశాను. ప్రేక్షకులు ఆదరించారు. అలాగే మిస్టర్ పర్ఫెక్ట్ చేశాను. ఆ సినిమాను కూడా ఆదరించారు. సినిమా రిలీజ్‌కు ముందుగానే సినిమాపై జనాలు ఓ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుని ఉంటారు. ఇతనేదో కొత్తగా ట్రై చేశాడనే అనుకుంటారు.
గౌరవం పెరిగింది...
బాహుబలి పార్ట్ 1 విడుదలకు ముందు మేం ప్రమోషన్స్‌కు వెళితే, వీళ్లేదో కొత్తగా సినిమా చేశారట అనే భావన అందరిలో ఉంది. కానీ బాహుబలి పార్ట్ 1 తర్వాత మంచి సక్సెస్ వచ్చింది. మంచి స్పందన వచ్చింది. బాహుబలి 2 ప్రమోషన్స్‌కు వెళ్ళినప్పుడు ముంబైలో మీడియా వ్యక్తులు లేచి నిలబడ్డారు. బాహుబలితో మాపై గౌరవం పెరిగిపోయింది. ఎవరైతే ఏమీ..మన ఇండియన్ సినిమాను గొప్పగా తీస్తున్నారని అందరూ అనుకుంటున్నారు. ఇండియన్ సినిమాల్లో కొత్తగా చేశారు వీళ్ళు ఎవరు అని అందరూ మాకు మంచి రెస్పాన్స్ వచ్చింది.
రానా ధైర్యానికి మెచ్చుకోవాలి..
బాహుబలి పార్ట్ 1లోరానా పాత్ర ఇంట్రడక్షన్ మాత్రమే చూశారు. సెకండ్ పార్ట్‌లో తన పాత్ర ఇంకా భయకరంగా, శక్తివంతంగా ఉంటుంది. రాజమౌళిగారు ప్రతి పాత్రను పీక్స్‌లో చూపించారు. రానా ఒక పక్క హీరోగా చేస్తున్నా, విలన్‌గా చేయడమంటే చిన్న విషయం కాదు, రానా ధైర్యానికి మెచ్చుకోవాలి.
ఎంత విన్నా సీన్ చూడాలనే ఆసక్తి ఉంది..
నేను బాహుబలి సినిమా షూటింగ్ టైంలో పెద్దగా ఎవరినీ కలవలేదండి..అయితే నేను కలిసిన కొంత మంది ఆ విషయాన్ని అడిగారు. అసలు విషయమేమంటే, కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడనేది ఓ ముప్పై సీన్స్‌తో లింక్ అయ్యి ఉండే ఎలిమెంట్, దాన్ని ఓ సీన్ ఆధారంగా చేసుకుని చెప్పమంటే కుదరదు. అది సినిమాలో చూడాల్సిందే. ఒకవేళ చెప్పినా ఎంజాయ్ చేయలేరు. ఎంత విన్నా కూడా సినిమాలో ఆ సీన్‌ను చూడాలనే ఆసక్తి చాలా మందికి ఉంటుంది.
అవన్నీ రూమర్స్..
ఈ సినిమా సక్సెస్‌తో పాటు మంచి విషయాలు, రూమర్స్ అన్నీ ఎడా పెడా వాయించేస్తున్నాయి. హాలీవుడ్లో నేను చేస్తాననడం రూమర్.
బాలీవుడ్లో కరణ్‌జోహార్ సినిమా చేస్తాననడం కూడా రూమర్.
తదుపరి చిత్రాలు..
నా నెక్ట్స్ సినిమాకు సంబంధించి చాలా ప్లాన్స్ ఉన్నాయి. దానికి సంబంధించి క్లారిటీ రావాలి. రెండు మూడు రోజుల్లో క్లారిటీ వస్తుంది.సుజిత్ సినిమాతో పాటు జిల్‌ఫేమ్ రాధాకృష్ణ మూవీ కూడా చేయాలనే ఆలోచన ఉంది. బాహుబలి 2 రిలీజ్ తర్వాత దానికి సంబంధించి కూడా ఆలోచిస్తాను.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
Welcome to IndiaGlitz comments! Please keep conversations courteous and relevant to the topic. To ensure productive and respectful discussions, you may see comments from our Community Managers, marked with an "IndiaGlitz Staff" label. For more details, refer to our community guidelines.
- logoutLogout
Login to post comment
-
Contact at support@indiaglitz.com