బాహుబలి స్టుపిడ్ సినిమా అంటున్న అలనాటి నటి
Send us your feedback to audioarticles@vaarta.com
బాహుబలి సినిమా ఎంతటి సంచలనం సృష్టించిందో తెలిసిందే. తెలుగు సినిమా ఇంత వసూలు చేస్తుందా..? తెలుగులో ఇంత అద్భుతంగా సినిమా తీసే దర్శకుడు ఉన్నాడా..? అని బాలీవుడ్ సైతం ఆశ్యర్యపోయేలా చేసింది. ఒక్క మాటలో చెప్పాలంటే..తెలుగు సినిమా సత్తాను ప్రపంచానికి చాటి చెప్పింది బాహుబలి.
అలాంటి సినిమాను స్టుపిడ్ సినిమా అన్నారు అలనాటి నటి జమున. అవును ఇది నిజంగా నిజం.రాజమండ్రి లో ఓ కార్యక్రమానికి హాజరైన జమున మాట్లాడుతూ...నేను సినిమాలు చూడడం మానేశాను. నా మనవడు కోరిక మేరకు బాహుబలి సినిమా చూసాను. బాహుబలి స్టుపిడ్ సినిమా. ఇందులో సాంకేతిక విలువలు తప్ప ఏమీ లేదు. ఈ సినిమాలో ఒక్క హీరో తప్ప మిగిలిన పాత్రల ఎంపిక సరిగా జరగలేదు అన్నారు. మరి..బాహుబలి స్టుపిడ్ సినిమా అని కామెంట్ చేసిన అలనాటి నటి జమున పై బాహుబలి టీమ్ స్పందిస్తుందేమో చూడాలి
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com