మరో అవార్డు రేసులో బాహుబలి...

  • IndiaGlitz, [Saturday,February 27 2016]

హాలీవుడ్ లో సాటర్న్ అవార్డ్స్ కు ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. గత నాలుగున్నర దశాబ్దాలుగా ది ఆకాడమీ ఆఫ్ ఫిలింస్ హర్రర్, ఫాంటసీ, సైన్స్, ఫిక్షన్ విభాగాలకు చెందిన మూవీలకు ఈ అవార్డులను ప్రకటిస్తుంది. ఈ ఏడాది ఈ అవార్డుల రేసులో టాలీవుడ్ మూవీ బాహుబలి బెస్ట్ ఫాంటసీ మూవీ, బెస్ట్ ఫిలం ప్రొడక్షన్ డిజైన్, బెస్ట్ మ్యూజిక్, బెస్ట్ సపోర్టింగ్ యాక్టరస్ విభాగాల్లో పోటీ పడుతుంది. ఓ రకంగా బాహుబలి ఫీవర్ టాలీవుడ్ నుండి హాలీవుడ్ వరకు ఇంకా తగ్గనేలేదని తెలుస్తుంది.