బాలీవుడ్ ఆలోచన ఉందంటున్న బాహుబలి...

  • IndiaGlitz, [Saturday,February 25 2017]

యంగ్ రెబ‌ల్ స్టార్ ప్ర‌భాస్ బాహుబ‌లి ఏప్రిల్ 28న ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. తెలుగు సినిమా చ‌రిత్ర‌ను ప్ర‌పంచానికి చాటిన ఈ సినిమా పార్ట్‌1తో పార్ట్‌2పై భారీ అంచ‌నాలు నెల‌కొన్నాయి. బాహుబ‌లి ముందు వ‌ర‌కు టాలీవుడ్‌కు ప‌రిమిత‌మైన ప్ర‌భాస్ ఇప్పుడు నేష‌న‌ల్ స్టార్ అయ్యాడు.

రీసెంట్‌గా ఇచ్చిన ఓ ఇంట‌ర్వ్యూలో ఇప్పుడు నేష‌నల్ స్టార్ అయ్యారు క‌దా..మ‌రి మీకు బాలీవుడ్ వెళ్ళే ఆలోచ‌న ఉందా అని అడిగితే..ఆలోచ‌న‌లు ఉన్నాయి..ప్ర‌స్తుతం చ‌ర్చ‌లు జ‌రుగుతున్నాయి. అన్నీ కుదిరితే త‌ప్ప‌కుండా చెబుతాను అంటూ తెలియ‌జేశాడు. బాహుబ‌లి త‌ర్వాత ప్ర‌భాస్‌, సుజిత్ ద‌ర్శ‌క‌త్వంలో యు.వి.క్రియేష‌న్స్ బ్యాన‌ర్‌పై తెలుగు, త‌మిళం, హిందీ భాష‌ల్లో ఓ సినిమా చేయ‌బోతున్నాడు. ఏదేమైనా బాహుబ‌లి త‌ర్వాత ప్ర‌భాస్ తెలుగుతో పాటు వేరే మార్కెట్స్‌పై కూడా దృష్టి సారించాడు.