వరుణ్ తేజ్ బాహుబలి భామ
Send us your feedback to audioarticles@vaarta.com
వరుణ్‌తేజ్ హీరోగా శ్రీనువైట్ల దర్శకత్వంలో రూపొందతోన్న చిత్రం `మిస్టర్`. సినిమా ఒక సాంగ్ మినహా చిత్రీకరణ అంతా పూర్తి చేసుకుంది. సమాంతరంగా పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు కూడా జరుగుతున్నాయి. స్పెషల్ సాంగ్ చిత్రీకరణ జరుగుతుంది. ఈ స్పెషల్ సాంగ్‌లో బాహుబలి చిత్రంలో మనోహరి...అనే పాటలో నటించిన ముగ్గురు హీరోయిన్స్‌లో ఒక అమ్మాయి మధు స్నేహ నటిస్తుంది.
ముందు ఈ సాంగ్‌ను శ్రీముఖితో చేయించాలనుకున్నారట. అయితే కొన్ని కారణాలతో శ్రీముఖి ఈ సాంగ్‌లో చేయలేకపోయింది. దాంతో నిర్మాతలు మధు స్నేహను సంప్రదించారట. వరుణ్‌తేజ్ హీరోగా లావణ్య త్రిపాఠి, హెబ్బా పటేల్ హీరో హీరోయిన్స్‌గా నటిస్తున్న మిస్టర్ చిత్రం ఏప్రిల్ 14న విడుదల కానుంది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Contact at support@indiaglitz.com
Comments