'భైరవద్వీపం' బాటలో 'బాహుబలి 2'
Send us your feedback to audioarticles@vaarta.com
22 ఏళ్ల కిత్రం విడుదలై సంచలన విజయం సాధించిన జానపద చిత్రం 'భైరవద్వీపం'. ఆ తరువాత మళ్లీ జానపద చిత్రాలలో ఘనవిజయం సాధించింది 'బాహుబలి' మాత్రమే. ఈ చిత్రానికి సీక్వెల్గా 'బాహుబలి 2' రానున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు ఈ 'బాహుబలి 2', నాటి సంచలన చిత్రం 'భైరవద్వీపం' ని ఫాలో కాబోతోంది.
అయితే అది ఏ విషయంలో అంటే.. రిలీజ్ డేట్ విషయంలో. 1994లో ఏప్రిల్ 14న 'భైరవద్వీపం' విడుదలైతే.. సరిగ్గా 23 ఏళ్ల తరువాత అదే ఏప్రిల్ 14న వచ్చే ఏడాదిలో 'బాహుబలి 2' రిలీజ్ కాబోతోంది. ఆల్రెడీ ఓ జానపద చిత్రానికి అచ్చొచ్చిన ఆ తేది.. సంచలన విజయం సాధించిన మరో జానపద చిత్రానికి సంబంధించిన సీక్వెల్కి కూడా కలిసొస్తుందో లేదో చూడాలి మరి.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com