కేరళలో 'బాహుబలి'కి షాక్
Send us your feedback to audioarticles@vaarta.com
ప్రభాస్, రాజమౌళి కాంబినేషన్ మోస్ట్ అవెయిటెడ్ మూవీ బాహుబలి` రేపు భారీ రిలీజ్ కి సిద్ధపడింది. తెలుగు, తమిళం, మలయాళం, హిందీ భాషల్లో విడుదలవుతున్న ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి. అయితే రేపు విడుదలనగా ఈ సినిమాకి కేరళలో షాకింగ్ న్యూస్ వినపడుతుంది. కేరళ డిస్ట్రిబ్యూటర్స్ రేపటి నుండి సమ్మె చేయనున్నారట. ఆ సమ్మె ఎందుకనేది కచ్చితమైన వివరాలు మాత్రం తెలియరాలేదు.
రేపటిలోగా సమస్య పరిష్కారానికి ప్రయత్నాలు జరుగుతున్నాయట. లేకుంటే ఈ సమ్మె కొనసాగుతుందని సమచారం. సమ్మె జరిగితే మాత్రం బాహుబలి టీమ్ కి పెద్ద షాకింగే అని చెప్పవచ్చు.చూద్దాం ఏం జరుగుతుందో..
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Contact at support@indiaglitz.com
Comments