వెండితెర అద్భుతం.. బాహుబలి శతదినోత్సవం
Send us your feedback to audioarticles@vaarta.com
తెలుగు వారు గర్వించదగ్గ సంచలన చిత్రం బాహుబలి. ప్రభాస్, రానా, అనుష్క, తమన్నా...ప్రధాన పాత్రల్లో దర్శకథీర రాజమౌళి తెరకెక్కించిన బాహుబలి ప్రపంచ వ్యాప్తంగా ఎవరూ ఊహించని విధంగా దాదాపు 600 కోట్లు పైగా వసూలు చేసి సెన్సేషన్ క్రియేట్ చేసింది. జులై 10న రిలీజైన బాహుబలి నేటికి 100 రోజులు పూర్తి చేసుకుంది. ఇండియన్ సినిమా అంటే...హిందీ సినిమానే అనువారికి అది కరెక్ట్ కాదని తెలియచెప్పిన చిత్రం బాహుబలి.
ప్రభాస్, రానా, అనుష్క, తమన్నా, రమ్యక్రిష్ణ, నాజర్...తదితరుల ఎక్టింగ్, గ్రాఫిక్స్..కీరవాణి మ్యూజిక్...ఇలా ఒకటేమిటి అన్నికుదిరి బాహుబలి చిత్రాన్ని నంబర్ వన్ ప్లేస్ లో నిలబెట్టాయి. బాహుబలి 2 చిత్రం షూటింగ్ త్వరలో ప్రారంభించడానికి ప్లాన్ చేస్తున్నారు. ప్రస్తుతం లోకేషన్స్ సెర్చ్ చేస్తున్నారు. వచ్చే సంవత్సరం నవంబర్ లో బాహుబలి 2 రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారట. తాజాగా బాహుబలి 3 కూడా తీయాలనే ఆలోచనలో జక్కన్న ఉన్నట్టు వార్తలు వస్తున్నాయి. బాహుబలి 2 కోసం ప్రీ ప్రొడక్షన్ వర్క్ స్టార్ట్ చేసిన జక్కన్నా..బాహుబలి 100 రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా కంగ్రాట్స్ అండ్ ఆల్ ద బెస్ట్.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com