బాహుబలి కామిక్ బుక్ వచ్చేసింది..!
Send us your feedback to audioarticles@vaarta.com
ప్రపంచ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన తెలుగు సినిమా బాహుబలి. దర్శకథీరుడు రాజమౌళి బాహుబలి సంచలన విజయం సాధించడంతో బాహుబలి 2 చిత్రం పై అంచనాలు భారీ స్ధాయిలో ఉన్నాయి. ఆ అంచనాలకు తగ్గట్టే బాహుబలి 2 చిత్రాన్ని రాజమౌళి తెరకెక్కిస్తున్నారు. ఇటీవల బాహుబలి 2 లోగో, ఫస్ట్ లుక్ & వర్చువల్ రియాలిటీలో మేకింగ్ రిలీజ్ చేసిన విషయం తెలిసిందే.
ఇప్పుడు బాహుబలి కామిక్ బుక్ రిలీజ్ చేసారు. ఈ కామిక్ బుక్ లో భల్లాలదేవతో పాటు పర్షియా, మంగోలి తదితర ప్రాంతాల నుంచి విలన్స్ వచ్చి బాహుబలిని ఎదురిస్తున్నారు. ఇదేంటి...బాహుబలి సినిమాలో అలా లేదు కదా అనుకోకండి. బాహుబలి సినిమాకి ఈ కామిక్ బుక్ లో కథకు సంబంధం ఉండదు. ఈ కామిక్ బుక్ రిలీజ్ సందర్భంగా రాజమౌళి ట్విట్టర్ లో...బాహుబలిని బిగ్ స్ర్కీన్ పైకి తీసుకురావడం ఓ ఎత్తైతే...బాహుబలి ప్రపంచం రోజురోజుకు పెరుగుతుండడం మరో ఎత్తు అంటూ స్పందించారు. బాహుబలి కామిక్ బుక్ ను గ్రాఫిక్ ఇండియా & ఆర్కా మీడియావర్క్స్ సంయుక్తంగా అందిస్తున్నాయి. ఈ సంచలన చిత్రాన్ని ప్రపంచ వ్యాప్తంగా ఏప్రిల్ 28న రిలీజ్ చేయనున్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Contact at support@indiaglitz.com
Comments