బాహుబ‌లి కామిక్ బుక్ వ‌చ్చేసింది..!

  • IndiaGlitz, [Monday,November 14 2016]

ప్ర‌పంచ వ్యాప్తంగా సంచ‌ల‌నం సృష్టించిన తెలుగు సినిమా బాహుబ‌లి. ద‌ర్శ‌క‌థీరుడు రాజ‌మౌళి బాహుబ‌లి సంచ‌ల‌న విజ‌యం సాధించ‌డంతో బాహుబ‌లి 2 చిత్రం పై అంచ‌నాలు భారీ స్ధాయిలో ఉన్నాయి. ఆ అంచ‌నాల‌కు త‌గ్గ‌ట్టే బాహుబ‌లి 2 చిత్రాన్ని రాజ‌మౌళి తెర‌కెక్కిస్తున్నారు. ఇటీవ‌ల బాహుబ‌లి 2 లోగో, ఫ‌స్ట్ లుక్ & వర్చువ‌ల్ రియాలిటీలో మేకింగ్ రిలీజ్ చేసిన విష‌యం తెలిసిందే.

ఇప్పుడు బాహుబ‌లి కామిక్ బుక్ రిలీజ్ చేసారు. ఈ కామిక్ బుక్ లో భ‌ల్లాల‌దేవ‌తో పాటు ప‌ర్షియా, మంగోలి త‌దిత‌ర ప్రాంతాల నుంచి విల‌న్స్ వ‌చ్చి బాహుబ‌లిని ఎదురిస్తున్నారు. ఇదేంటి...బాహుబ‌లి సినిమాలో అలా లేదు క‌దా అనుకోకండి. బాహుబ‌లి సినిమాకి ఈ కామిక్ బుక్ లో క‌థ‌కు సంబంధం ఉండ‌దు. ఈ కామిక్ బుక్ రిలీజ్ సంద‌ర్భంగా రాజ‌మౌళి ట్విట్ట‌ర్ లో...బాహుబ‌లిని బిగ్ స్ర్కీన్ పైకి తీసుకురావ‌డం ఓ ఎత్తైతే...బాహుబ‌లి ప్ర‌పంచం రోజురోజుకు పెరుగుతుండ‌డం మ‌రో ఎత్తు అంటూ స్పందించారు. బాహుబ‌లి కామిక్ బుక్ ను గ్రాఫిక్ ఇండియా & ఆర్కా మీడియావ‌ర్క్స్ సంయుక్తంగా అందిస్తున్నాయి. ఈ సంచ‌ల‌న చిత్రాన్ని ప్ర‌పంచ వ్యాప్తంగా ఏప్రిల్ 28న రిలీజ్ చేయ‌నున్నారు.

More News

నిర్మాణాంతర కార్యక్రమాల్లో విజయ్ సేతుపతి 'డా.ధర్మరాజు ఎం.బి.బి.ఎస్'

డిఫరెంట్ మూవీస్ తో తమిళంలో వరుస విజయాలో దూసుకెళ్తున్న హీరో విజయ్ సేతుపతి 'పిజ్జా' సినిమాతో

సాయిధరమ్ తేజ్ కెరీర్ కు రెండేళ్లు..!

మెగాస్టార్ మేనల్లుడుగా సినీ రంగంలో ప్రవేశించిన యువ హీరో సాయిధరమ్ తేజ్.పిల్లా నువ్వులేని జీవితం సినిమాతో ప్రేక్షకులకు పరిచయమైన తేజు ఈరోజుకి హీరోగా రెండేళ్లు పూర్తి చేసుకున్నాడు.

విక్టరీ వెంకటేష్ నోబెల్ వర్క్...

విక్టరీ వెంకటేష్ ఇప్పుడు గురు సినిమాతో బిజీగా ఉన్నాడు.

జ‌య‌మ్ము నిశ్చ‌య‌మ్మురా థియేట్రిక‌ల్ ట్రైల‌ర్ రిలీజ్..!

క‌మెడియ‌న్ ట‌ర్న‌డ్ హీరో శ్రీనివాస‌రెడ్డి న‌టించిన తాజా చిత్రం జ‌య‌మ్ము నిశ్చ‌య‌మ్మురా. ఈ చిత్రంలో శ్రీనివాస‌రెడ్డి, పూర్ణ జంట‌గా న‌టించారు.  ఈ చిత్రాన్ని శివ‌రాజ్ ఫిల్మ్స్ బ్యాన‌ర్ పై శివ‌రాజ్ క‌నుమూరి స్వీయ నిర్మాణంలో తెర‌కెక్కిస్తున్నారు.

తలసాని ప్రత్యేక విందు కార్య క్రమానికి హాజరైన అతిరథ మహారథులు

తెలంగాణ రాష్ట్ర సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్ ఇంట ఇటీవలే శుభకార్యం జరిగిన సంగతి తెలిసిందే. తలసాని ద్వితీయ పుత్రిక చి.ల.సౌ స్వాతికి చి.రవికుమార్ యాదవ్తో ఇటీవల వివాహం జరిగింది.