బాహుబ‌లి కి సి.ఎం, జ‌గ‌న్ అభినంద‌న‌లు..

  • IndiaGlitz, [Monday,March 28 2016]

తెలుగు సినిమా కీర్తిని విశ్వ‌వ్యాప్తం చేసిన సంచ‌ల‌న చిత్రం బాహుబ‌లి. తెలుగులో రూపొందిన ప్రాంతీయ చిత్రం ప్ర‌పంచ వ్యాప్తంగా సంచ‌ల‌నం సృష్టించి రికార్డ్ స్ధాయిలో దాదాపు 600 కోట్లు వసూలు చేయ‌డం అంటే మామూలు విష‌యం కాదు. అంతే కాకుండా తొలిసారి జాతీయ ఉత్త‌మ చిత్రంగా తెలుగు చిత్రం బాహుబ‌లి ఎంపిక కావ‌డం తెలుగు వారంద‌రికీ గ‌ర్వ‌కారణం. 63వ జాతీయ అవార్డ్స్ లో జాతీయ ఉత్త‌మ చిత్రంగా కేంద్ర‌ప్ర‌భుత్వం ప్ర‌క‌టించిన‌ప్ప‌టి నుంచి బాహుబ‌లి టీమ్ ని అభినందిస్తూ...సినీ ప్ర‌ముఖులు కింగ్ నాగార్జున‌, విక్ట‌రీ వెంక‌టేష్, ద‌ర్శ‌క‌ర‌త్న దాస‌రి నారాయ‌ణ‌రావు, నిర్మాత ద‌గ్గుబాటి సురేష్ బాబు...ఇలా సినీ ప్ర‌ముఖులంద‌రూ బాహుబ‌లి టీమ్ పై ముఖ్యంగా ద‌ర్శ‌క‌ధీర రాజ‌మౌళి పై ప్ర‌శంస‌ల వ‌ర్షం కురిపిస్తున్నారు.

సినీ ప్ర‌ముఖులే కాకుండా ఆంధ్ర‌ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబు నాయుడు, ప్ర‌తిప‌క్ష‌నేత వై.ఎస్.జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి బాహుబ‌లి టీమ్ ని అభినందించారు. బాహుబ‌లి జాతీయ ఉత్త‌మ చిత్రం అవార్డు అందుకోవడం ఫ్యూర్ సినిమాటిక్ బ్రిలియ‌న్స్ అంటూ చంద్ర‌బాబు నాయుడు బాహుబ‌లి టీమ్ ని ట్విట్ట‌ర్ ద్వారా అభినందించారు. అలాగే వై.ఎస్ జ‌గ‌న్ స్పందిస్తూ....ఇలాంటి అరుదైన పుర‌స్కారం అందుకోవ‌డం తెలుగు సినిమా ప‌రిశ్ర‌మ‌కు గ‌ర్వ‌కార‌ణం...గౌరవం. భ‌విష్య‌త్ లో ఇలాంటి మ‌రిన్ని చిత్రాలును తెలుగు సినీ ప‌రిశ్ర‌మ అందించాల‌ని ఆశిస్తున్నాను అంటూ బాహుబ‌లి టీమ్ కి అభినంద‌న‌లు తెలియ‌చేసారు.

More News

బాహుబలి, కంచె చిత్రాలను ప్రశంసించిన దాసరి

63వ జాతీయ అవార్డులలో తెలుగు సినిమా తన సత్తాను చాటింది. అత్యున్నత సాంకేతిక విలువలతో తెరకెక్కించిన ‘బాహుబలి’ ఉత్తమ జాతీయ చిత్రంగా అవార్డు సాధించగా, రెండవ ప్రపంచ యుద్ధ నేపథ్యంలో వచ్చిన ప్రేమకథా చిత్రం ‘కంచె’ ఉత్తమ పాంతీయ చిత్రంగా అవార్డును కైవసం చేసుకుంది.

'ఊపిరి' చిత్రాన్ని అభినందించిన దర్శకరత్న

తెలుగు, తమిళ భాషల్లో ఈ మార్చి 25న విడుదలైన ‘ఊపిరి’ చిత్రం సూపర్ డూపర్ హిట్ అయింది.

హారర్ ఎంటర్ టైనర్ 'శశికళ' ట్రైలర్ విడుదల

గతేడాది తమిళంలో ఘన విజయం సాధించిన ఓ హారర్ ఎంటర్ టైనర్ ను తెలుగులో "శశికళ" పేరుతో అనువదిస్తున్నారు భీమవరం టాకీస్ అధినేత తుమ్మలపల్లి రామసత్యనారాయణ.

'స‌ర్దార్' కి కాజ‌ల్ పాజిటివ్‌ సెంటిమెంట్‌

ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్‌తో కాజ‌ల్  తొలిసారిగా  జ‌త‌క‌ట్టిన   సినిమా  'స‌ర్దార్ గ‌బ్బ‌ర్ సింగ్‌'. ఏప్రిల్ 8న విడుద‌ల‌కు సిద్ధ‌మ‌వుతోంది ఈ సినిమా 'మ‌గ‌ధీర' త‌రువాత మ‌రోమారు యువ‌రాణి పాత్ర‌లో కాజ‌ల్ వెండితెర‌పై ద‌ర్శ‌న‌మివ్వ‌నుందీ సినిమా కోసం.

ఎన్టీఆర్ 'ఆది' కి 14 ఏళ్లు

యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ కెరీర్‌లో తొలి బ్లాక్‌బ‌స్ట‌ర్‌గా నిలిచిన చిత్రం 'ఆది'. ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు వి.వి.వినాయ‌క్ తొలిసారిగా ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన చిత్రం కూడా ఇదే. ఫ్యాక్ష‌న్ బ్యాక్‌డ్రాప్‌లో తెర‌కెక్కిన ఈ సినిమాలో తార‌క్ న‌ట‌న నంద‌మూరి అభిమానులనే కాదు.