బాహుబలి కి సి.ఎం, జగన్ అభినందనలు..
Send us your feedback to audioarticles@vaarta.com
తెలుగు సినిమా కీర్తిని విశ్వవ్యాప్తం చేసిన సంచలన చిత్రం బాహుబలి. తెలుగులో రూపొందిన ప్రాంతీయ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా సంచలనం సృష్టించి రికార్డ్ స్ధాయిలో దాదాపు 600 కోట్లు వసూలు చేయడం అంటే మామూలు విషయం కాదు. అంతే కాకుండా తొలిసారి జాతీయ ఉత్తమ చిత్రంగా తెలుగు చిత్రం బాహుబలి ఎంపిక కావడం తెలుగు వారందరికీ గర్వకారణం. 63వ జాతీయ అవార్డ్స్ లో జాతీయ ఉత్తమ చిత్రంగా కేంద్రప్రభుత్వం ప్రకటించినప్పటి నుంచి బాహుబలి టీమ్ ని అభినందిస్తూ...సినీ ప్రముఖులు కింగ్ నాగార్జున, విక్టరీ వెంకటేష్, దర్శకరత్న దాసరి నారాయణరావు, నిర్మాత దగ్గుబాటి సురేష్ బాబు...ఇలా సినీ ప్రముఖులందరూ బాహుబలి టీమ్ పై ముఖ్యంగా దర్శకధీర రాజమౌళి పై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.
సినీ ప్రముఖులే కాకుండా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ప్రతిపక్షనేత వై.ఎస్.జగన్ మోహన్ రెడ్డి బాహుబలి టీమ్ ని అభినందించారు. బాహుబలి జాతీయ ఉత్తమ చిత్రం అవార్డు అందుకోవడం ఫ్యూర్ సినిమాటిక్ బ్రిలియన్స్ అంటూ చంద్రబాబు నాయుడు బాహుబలి టీమ్ ని ట్విట్టర్ ద్వారా అభినందించారు. అలాగే వై.ఎస్ జగన్ స్పందిస్తూ....ఇలాంటి అరుదైన పురస్కారం అందుకోవడం తెలుగు సినిమా పరిశ్రమకు గర్వకారణం...గౌరవం. భవిష్యత్ లో ఇలాంటి మరిన్ని చిత్రాలును తెలుగు సినీ పరిశ్రమ అందించాలని ఆశిస్తున్నాను అంటూ బాహుబలి టీమ్ కి అభినందనలు తెలియచేసారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Contact at support@indiaglitz.com
Comments