'బాహుబలి' ముందు...అక్కడ మొదలవుతుంది!
Send us your feedback to audioarticles@vaarta.com
బాహుబలి సినిమాను అంత తేలిగ్గా ఎవరూ మర్చిపోలేరు. కల్పిత గాథ అయినప్పటికీ అప్పుడెప్పుడో నిజంగానే జరిగిందా అన్నంత ఘనంగా తెరకెక్కించారు బాహుబలి. ఎక్కడో ప్రాంతీయ భాషా చిత్రంగా మిగిలిన తెలుగు సినిమాలను ప్రపంచయవనికపై నిలిపి చూపారు. తాజాగా బాహుబలికి ప్రీక్వెల్ సిద్ధమవుతోంది. అయితే అది వెండితెరమీద కాదు. బుల్లితెరమీద. `బాహుబలి బిఫోర్ ద బిగినింగ్` అనే సంకేతంతో ఆనంద్ నీలకంఠన్ రాసిన `ది రైజ్ ఆఫ్ శివగామి` నెట్ఫిక్ల్స్ కోసం తరకెక్కుతోంది.
శివగామి అనగానే వెండితెర ప్రేక్షకులకు రమ్యకృష్ణ గంభీరత గుర్తుకొస్తుంది. కానీ బుల్లితెర అభిమానులకు మాత్రం ఇకపై మృణాల్ ఠాకూర్ గుర్తుకురానుంది. మృణాల్ ఇప్పుడు శివగామి పాత్రలో నటించనున్నారు. స్కంద దాసుడి పాత్రలో రాహుల్ బోస్ నటించనున్నారు. వీరితో పాటు అతుల్ కులకర్ణి, వాకర్ షేక్, జమీల్ ఖాన్, సిద్ధార్థ్ అరోరా, అనూప్ సోనీ కీలక పాత్రల్లో కనిపించనున్నారు. రాజమౌళి తెరకెక్కించిన బాహుబలిలో శివగామి పాత్రకు సముచిత స్థానం ఉంది. ఇప్పుడు నెట్ ఫ్లిక్స్ కోసం తెరకెక్కుతున్న దానిలోనూ శివగామి పాత్ర ప్రస్థానాన్ని వివరిస్తారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Diya Harini
Contact at support@indiaglitz.com