'బాహుబ‌లి' ముందు...అక్క‌డ మొద‌ల‌వుతుంది!

  • IndiaGlitz, [Saturday,November 10 2018]

బాహుబ‌లి సినిమాను అంత తేలిగ్గా ఎవ‌రూ మ‌ర్చిపోలేరు. క‌ల్పిత గాథ అయిన‌ప్ప‌టికీ అప్పుడెప్పుడో నిజంగానే జ‌రిగిందా అన్నంత ఘ‌నంగా తెర‌కెక్కించారు బాహుబ‌లి. ఎక్క‌డో ప్రాంతీయ భాషా చిత్రంగా మిగిలిన తెలుగు సినిమాల‌ను ప్ర‌పంచ‌య‌వ‌నిక‌పై నిలిపి చూపారు. తాజాగా బాహుబ‌లికి ప్రీక్వెల్ సిద్ధ‌మ‌వుతోంది. అయితే అది వెండితెర‌మీద కాదు. బుల్లితెర‌మీద‌. 'బాహుబ‌లి బిఫోర్ ద బిగినింగ్‌' అనే సంకేతంతో ఆనంద్ నీల‌కంఠ‌న్ రాసిన 'ది రైజ్ ఆఫ్ శివ‌గామి' నెట్‌ఫిక్ల్స్ కోసం త‌ర‌కెక్కుతోంది.

శివ‌గామి అన‌గానే వెండితెర ప్రేక్ష‌కుల‌కు ర‌మ్య‌కృష్ణ గంభీర‌త గుర్తుకొస్తుంది. కానీ బుల్లితెర అభిమానుల‌కు మాత్రం ఇక‌పై మృణాల్ ఠాకూర్ గుర్తుకురానుంది. మృణాల్ ఇప్పుడు శివ‌గామి పాత్ర‌లో న‌టించ‌నున్నారు. స్కంద దాసుడి పాత్ర‌లో రాహుల్ బోస్ న‌టించ‌నున్నారు. వీరితో పాటు అతుల్ కుల‌క‌ర్ణి, వాక‌ర్ షేక్‌, జ‌మీల్ ఖాన్‌, సిద్ధార్థ్ అరోరా, అనూప్ సోనీ కీల‌క పాత్ర‌ల్లో క‌నిపించ‌నున్నారు. రాజ‌మౌళి తెర‌కెక్కించిన బాహుబ‌లిలో శివ‌గామి పాత్ర‌కు స‌ముచిత స్థానం ఉంది. ఇప్పుడు నెట్ ఫ్లిక్స్ కోసం తెర‌కెక్కుతున్న దానిలోనూ శివ‌గామి పాత్ర ప్ర‌స్థానాన్ని వివ‌రిస్తారు.

More News

బ్రిడ్జి మీద ఫ‌న్నా? ఫ‌్ర‌స్ట్రేష‌నా?

అనిల్ రావిపూడి తీసే సినిమాల‌ను చూస్తే ఈ జ‌న‌రేష‌న్‌తో పాటు నిన్న‌టి జ‌న‌రేష‌న్ జ్ఞాప‌కాల‌ను కూడా గుర్తుచేసే ప్ర‌య‌త్నం చేస్తుంటారేమోన‌ని అనిపిస్తుంది.

వారెవా ఆది..!

ఆది సాయికుమార్ లుక్‌కి ట్రెమండ‌స్ రెస్సాన్స్ వ‌స్తోంది. ఆయ‌న హీరోగా న‌టిస్తున్న సినిమా ఆప‌రేష‌న్ గోల్డ్ ఫిష్‌. ఇందులో ఆయ‌న ఎన్ ఎస్ జి క‌మాండోగా న‌టిస్తున్నారు.

ఇండియన్ సినిమా స్థాయిని పెంచే 'కేజీఎఫ్'.. ఐదు భాషల్లో ట్రైలర్ విడుదల

కైకాల సత్యనారాయణ సమర్పణలో హోంబలే ఫిల్మ్స్ పతాకంపై రాకింగ్ స్టార్ యష్ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో విజయ్ కిరగందూర్ నిర్మాతగా రూపొందుతున్న భారీ బడ్జెట్ చిత్రం 'కేజీఎఫ్(కోలార్ గోల్డ్ ఫీల్డ్స్)'.

బిగ్ బాస్ ఫేం భాను శ్రీ  ప్ర‌ధాన పాత్ర‌లో ఈ అమ్మాయి మూవీ ప్రారంభం

బిగ్ బాస్ ,ఏడు చేప‌ల క‌థ  ఫేం భాను శ్రీ ప్ర‌ధాన‌పాత్ర‌లో  దొంతు ర‌మేష్ ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌య‌మౌతూ  తెర‌కెక్కిస్తున్న " ఈ అమ్మాయి "

డిసెంబర్ లో విడుదలకు సిద్ధమవుతున్న '47డేస్'

సత్యదేవ్, పూజా ఝవేరీ, రోహిణి ప్రకాష్ ప్రధాన పాత్రలలో నటిస్తోన్న చిత్రం 47డేస్. ద మిస్టరీ అన్ ఫోల్డ్స్ అనేది ఉపశీర్షిక.