బాహుబ‌లి యానిమేష‌న్ టీజ‌ర్ రిలీజ్..!

  • IndiaGlitz, [Saturday,October 01 2016]

బాహుబ‌లి సినిమాతో తెలుగు సినిమా ఖ్యాతిని ప్ర‌పంచానికి చాటి చెప్పిన ద‌ర్శ‌క‌ధీరుడు రాజ‌మౌళి. ప్ర‌భాస్, రానా, అనుష్క‌, త‌మ‌న్నా, ర‌మ్య‌కృష్ణ ప్ర‌ధాన తారాగ‌ణంగా బాహుబ‌లి 2 రూపొందుతుంది. రెండు పాట‌లు, కొన్ని సీన్స్ మిన‌హా షూటింగ్ పూర్త‌య్యింది. డిసెంబ‌ర్ కి మొత్తం షూటింగ్ పూర్త‌వుతుంది. ఆర్కా మీడియా బ్యాన‌ర్ పై అత్యంత ప్ర‌తిష్టాత్మ‌కంగా రూపొందుతున్న బాహుబ‌లి 2 చిత్రం ఏప్రిల్ 28న ప్ర‌పంచ వ్యాప్తంగా ప్రేక్ష‌కుల ముందుకు రానుంది.

ఇదిలా ఉంటే...ఈరోజు బాహుబ‌లి యానిమేష‌న్ టీజ‌ర్ ను రాజ‌మౌళి ట్విట్ట‌ర్ ద్వారా రిలీజ్ చేసారు. ఆర్కామీడియా, గ్రాఫిక్ ఇండియా, అమేజాన్ ఇన్ క‌లిసి యానిమేష‌న్ సీరిస్ చేస్తుండ‌డంతో చాలా ఎక్సైట్ అవుతున్నాను అంటూ త‌న సంతోషాన్ని తెలియ‌చేసారు రాజ‌మౌళి. ఇక బాహుబ‌లి 2 ఫ‌స్ట్ లుక్ ను ప్ర‌భాస్ పుట్టిన‌రోజు (అక్టోబ‌ర్ 23) కానుక‌గా ఈనెల 22న రిలీజ్ చేయ‌నున్నారు.

More News

ధనుష్ ద్విపాత్రాభినయంతో వస్తోన్న 'ధర్మయోగి' (ది లీడర్)

'రఘువరన్బి.టెక్'చిత్రంతో తెలుగులోనూ మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్న హీరో ధనుష్ తాజాగా 'రైల్' చిత్రంతో ఓ డిఫరెంట్ ఎక్స్ పీరియన్స్ ని ఇచ్చారు.

బాహుబలికి ఆది లేదు అంతం లేదు - నేను లేకపోయినా బాహుబలి ఎప్పటికీ ఉండాలి - రాజమౌళి

తెలుగు సినిమా ఖ్యాతిని విశ్వవ్యాప్తం చేసిన సంచలన చిత్రం బాహుబలి.ప్రభాస్,రానా,అనుష్క,తమన్నా,రమ్యకృష్ణ ప్రధాన పాత్రలు పోషించిన బాహుబలి చిత్రాన్ని దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించారు.

నరేంద్ర మోడీకి అభినంద‌న‌లు తెలియ‌చేసిన కృష్ణంరాజు..!

పాక్ ఆక్ర‌మిత కాశ్మీర్ (పీవోకే)లోని ఉగ్ర‌వాద చొర‌బాటు శిబిరాల‌పై మెరుపుదాడులు చేసి విజ‌యం సాధించిన భారత సైన్యానికి దేశం యావ‌త్తు జై కొడుతుంది. ఈ దాడులు గురించి వివ‌రించాడానికి ఏర్పాటు చేసిన అఖిల‌ప‌క్ష స‌మావేశంలో నేత‌లంతా సైన్యాన్ని ప్ర‌శంసించారు.

ఊటీలో మిస్ట‌ర్ వ‌రుణ్ తేజ్ కు గాయాలు..!

మెగా హీరో వ‌రుణ్ తేజ్ మిస్ట‌ర్, ఫిదా చిత్రాల్లో న‌టిస్తున్నారు. శేఖ‌ర్ క‌మ్ముల ఫిదా చిత్రాన్ని తెర‌కెక్కిస్తుంటే, శ్రీను వైట్ల మిస్ట‌ర్ చిత్రాన్ని తెర‌కెక్కిస్తున్నారు.

అభినేత్రి సెన్సార్ పూర్తి..!

ప్ర‌భుదేవా, త‌మ‌న్నా, సోనూసూద్ ప్ర‌ధాన పాత్ర‌ల్లో ఎ.ఎల్. విజ‌య్ తెర‌కెక్కించిన విభిన్న క‌థాచిత్రం అభినేత్రి. ఈ చిత్రాన్ని కోన ఫిల్మ్ కార్పోరేష‌న్, బ్లూ స‌ర్కిల్ కార్పోరేష‌న్, బి.ఎల్.ఎన్ సినిమా సంయుక్తంగా నిర్మించాయి.