నటితో బాహుబలి నటుడు ఎఫైర్.. భార్య ఆత్మహత్య!
Send us your feedback to audioarticles@vaarta.com
ప్రముఖ సీరియల్ నటుడు, బాహుబలి ఆర్టిస్ట్ మధు ప్రకాష్ సతీమణి భారతి ఆత్మహత్య చేసుకుంది. బుధవారం ఉదయం హైదరాబాద్‌లోని స్వగృహంలో భారతి బలవన్మరణానికి పాల్పడింది. ఓ సీరియల్ నటితో మధు ప్రకాష్ చనువుగా ఉంటూ ఆమెతో ఎఫైర్ పెట్టుకున్నాడని సమాచారం. అయితే పలుమార్లు మధును భార్య మందలించినప్పటికీ ఆయనలో ఎలాంటి మార్పు రాలేదు. అంతేకాదు ఈ విషయాన్ని కుటుంబ సభ్యులు ఆఖరికి పోలీసులకు చెప్పి పలుమార్లు కౌన్సిలింగ్ ఇప్పించినట్లు తెలుస్తోంది. అయినప్పటికీ మధు ప్రకాష్‌లో ఎలాంటి మార్పు రాకపోవడంతో భారతి ఆత్మహత్యకు పాల్పడింది.
స్థానిక సమాచారం మేరకు ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. మరోవైపు ఈ ఘటనకు కారకులైన మధు ప్రకాష్.. ఆయన ప్రియురాలిని కఠినంగా శిక్షించాలంటూ భారతీ కుటుంబ సభ్యులు పోలీసులు డిమాండ్ చేస్తున్నారు. ఇదిలా ఉంటే.. మధు ప్రకాష్ బాహుబలితో పాటు పలు సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్టుగా నటించాడు. లండన్ నుంచి వచ్చిన భారతీ రెండేళ్ల క్రితం మధుప్రకాశ్‌ను పెళ్లి చేసుకుంది. అంతా హాయిగా ఉంది.. జీవితం సాఫీగా సాగుతుందనుకున్న టైమ్‌లో ఇలా విషాదం చోటు చేసుకుంది.
కాగా.. ఈ మధ్య టాలీవుడ్లో వరుస విషాదాలు చోటుచేసుకుంటున్నాయి. క్షణికావేశంలో ఇలా ఆత్మహత్యలకు పాల్పడుతూ నిండు ప్రాణాలను వదులుకుంటున్నారు. అయితే సమస్యల పరిష్కారానికి ఆత్మహత్యలకు కాదన్న విషయాన్ని రీల్లో నటించే వీరికే తెలియక ఇలా నటీనటులు, కుటుంబ సభ్యులు రియల్‌లైఫ్‌లో బలవన్మరణానికి పాల్పడుతుండటం గమనార్హం.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout